Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

దీపారాధ‌న చేస్తున్నారా..? అయితే ఈ పొర‌పాట్లు చేస్తున్నారేమో ఒకసారి ప‌రిశీలించండి..!

Admin by Admin
March 22, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

దీపం.. చీకటిని పారద్రోలి వెలుగును ఇస్తుంది. అంతరంగిక పరిశీలిస్తే జ్ఞానానికి ప్రతీక. అలాంటి దీపాన్ని సాక్షాత్తు దైవస్వరూపంగా హిందూ ధర్మం చెప్తుంది. అయితే చాలామంది నిత్యం దీపారాధన చేసినా.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి.. దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే.. నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను పండితులు చెప్పిన‌ విషయాలు తెలుసుకుందాం… పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరం. అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి, మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే.. గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి, సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే.. రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే.. సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షణముఖంగా దీపం వెలిగిస్తే.. అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి. దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే.. పూర్వజన్మ పాపాలు తొలగిపోయి.. సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి, ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్ర్తాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా.. శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే.. శ్రేయస్కరం.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

if you are doing deeparadhana make sure you are not doing these mistakes

దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే.. నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే.. దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 48 రోజులు దీపం వెలిగిస్తే.. సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు. ఇక వీలుకాని పరిస్థితుల్లో మంచిది అనుకున్న నూనెతో దీపారాధన చేయండి.

Tags: deeparadhana
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

న‌ల్ల ద్రాక్ష‌ల‌ను రోజూ తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.