Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

అఘోరాలు శవాల మధ్య ఎందుకు గడుపుతారో తెలుసా.??

Admin by Admin
February 3, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. అఘోరీ అంటే సంస్కృతంలో ‘భయం కలిగించని’ అన్న అర్థం ఉంది. కానీ, వీరి వేషధారణ, అసాధారణ ఆచారవ్యవహారాలు భీతిగొలుపుతాయి. అదేసమయంలో వీరిపట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. ”ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను దాటి తమదైన పద్ధతులు ఆచరిస్తారు” అని లండన్‌లోని ‘స్కూల్ ఆప్ ఆఫ్రికన్, ఓరియెంటల్ స్టడీస్’ సంస్కృత బోధకుడు జేమ్స్ మాలిన్సన్ అభిప్రాయపడ్డారు.

ప్రధాన స్రవంతిలో ఉంటూ ఆధ్యాత్మిక గురువుగా శిష్యులకు ఉపదేశాలిచ్చే మాలిన్సన్ అనేకసార్లు అఘోరాలను కలుసుకున్నారు. అఘోరాల వైఖరి సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలను తోసిపుచ్చేలా ఉంటుంది. తాము అనుసరించే ఆధ్యాత్మిక మార్గంలో శవాలను తినడం వంటి ప్రమాదకర పద్ధతులు పాటిస్తుంటారు. ఇతరులకు భిన్నంగా తాము చేసే ఈ పనుల ద్వారానే అత్యున్నత చేతనాస్థితిని పొందుతామని వారు భావిస్తారు’ అంటారు మాలిన్సన్. కుంభమేళా సమయంలో నదీసంగమంలో పవిత్ర స్నానాలకు వచ్చే అఘోరాల్లో కొందరు నకిలీలు కూడా ఉంటారని.. ఆ సమయంలో వచ్చే భక్తులు, పర్యటకులను పూజలు, ఆశీర్వచనాల పేరిట డబ్బు సంపాదించుకునేందుకు ఇలాంటి అవతారమెత్తేవారూ ఉంటారని చెప్పారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

why aghoras live that kind of life

నిజమైన అఘోరాలకు డబ్బుపై వ్యామోహం ఉండదని, వారు డబ్బును ఆశించరని థక్కర్ తెలిపారు. అఘోరాలు అందరి మంచి కోసం పూజలు చేస్తారని… పిల్లలు కలగాలని, ఇల్లు కట్టుకోవాలని.. ఇలా అనేక కోరికలతో వచ్చి ఆశీర్వచనాలు కోరేవారిని వారు ఏమాత్రం పట్టించుకోరని చెప్పారు. అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. ఉత్తర భారతదేశంలో అఘోరాల్లో పురుషులే ఉంటారు. కానీ, పశ్చిమబెంగాల్‌లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలూ కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు. ”చాలామంది చావంటే భయపడతారు. శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు. కానీ, అఘోరాలకు అదే ఆరంభ స్థానం. సాధారణ ప్రజలు పాటించే నియమాలు, విలువలను వారు ధిక్కరిస్తారు” అంటారు థక్కర్.

గ‌త కొన్ని సంవత్సరాలుగా అఘోరాలు బయటి ప్రపంచంలోని మంచినీ స్వీకరిస్తూ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. కుష్టు రోగులకు వైద్య సేవలు అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ”సమాజం దూరం పెడుతున్న వర్గాల కోసం అఘోరాలు పనిచేస్తున్నారు” అని మిన్నెసోటాకు చెందిన మెడికల్, కల్చరల్ ఆంత్రోపాలజిస్ట్’ రాన్ బారెట్ చెప్పారు. కుష్టు వ్యాధి బారినపడి సొంత కుటుంబాలకు దూరమైన ఎంతోమందిని అఘోరాలు వారణాసిలో తాము నిర్వహిస్తున్న ఆసుపత్రిలో చేర్చి సేవలందిస్తున్నారు. వారికి ఆయుర్వేదం నుంచి అల్లోపతీ వరకు అన్ని రకాల వైద్యం అందిస్తున్నారు.ఇటీవల కాలంలో కొందరు అఘోరాలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు చిన్నపాటి వస్త్రాలను ధరిస్తున్నారు. అంతేకాదు… కొందరు సెల్‌ఫోన్లు వాడుతున్నారు.. ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు.

దేశంలో ఎంతమంది అఘోరాలు ఉన్నారనే విషయంలో స్పష్టమైన లెక్కలు లేనప్పటికీ ల‌క్ష‌ల సంఖ్యలో ఉన్నట్లు మాత్రం అంచనాలున్నాయి.”తాము మృతదేహాలతో సంభోగిస్తామని బహిరంగంగా అంగీకరించిన అఘోరాలు ఉన్నారు. కొందరు తాము జరిపే కర్మకాండల్లో భాగంగా వేశ్యలతోనూ సంభోగిస్తారు. కానీ, అఘోరాల్లో ఏ ఒక్కరూ స్వలింగ సంపర్కాన్ని ఆమోదించరు, ఆచరించరు” అని చెప్పారు మాలిన్సన్. ఇంకో విషయం ఏంటంటే… అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను మిగతా అఘోరాలు తినరు. వారిని దహనమో, పూడ్చిపెట్టడమో చేస్తారు.

Tags: aghoras
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే కుంకుమ పువ్వు.. ఎలా తీసుకోవాలంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.