Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chicken Fry Piece Biryani : చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ త‌యారీ ఇలా.. రుచి చూస్తే అస‌లు వ‌ద‌ల‌రు..!

Admin by Admin
October 27, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chicken Fry Piece Biryani : ఆదివారం వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది చికెన్ లేదా మ‌ట‌న్ వంటి మాంసాహారాల‌ను తినేందుకు ఎక్కువ ఆస‌క్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది చికెన్ ను తెచ్చుకుని వివిధ ర‌కాలుగా వండి తింటుంటారు. మ‌టన్ ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక చికెన్ తినే వారే ఎక్కువ‌గా ఉంటారు. ఇక చికెన్‌తో చాలా మంది బిర్యానీ చేసి తింటారు. కానీ ఈ మ‌ధ్య కాలంలో బ‌య‌ట మ‌న‌కు ఎక్కువ‌గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ గురించి విన‌బ‌డుతోంది. దీన్ని రెస్టారెంట్ల‌లో బాగా విక్ర‌యిస్తున్నారు. అయితే కాస్త శ్ర‌మించాలే గానీ దీన్ని సుల‌భంగా మ‌న ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

చికెన్ – పావు కిలో, నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1 (పెద్ద‌ది), త‌రిగిన ప‌చ్చి మిర్చి -5, జీడిప‌ప్పు – కొద్దిగా, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నూనె – 4 టేబుల్ స్పూన్స్, నిమ్మ ర‌సం – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, నీళ్లు – త‌గిన‌న్ని.

chicken fry piece biryani make like this very tasty

మ‌సాలా దినుసులు..

దాల్చిన చెక్క – 3 (చిన్న‌వి), యాల‌కులు – 3,ల‌వంగాలు – 3 , బిర్యానీ ఆకు – రెండు, సాజీరా – ఒక టీ స్పూన్.

చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని త‌యారు చేసే విధానం..

ముందుగా చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, నిమ్మ‌ర‌సం వేసి చికెన్ కు బాగా ప‌ట్టేలా క‌లుపుకోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత మూత పెట్టి అర గంట పాటు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక మ‌సాలా దినుసులు, త‌రిగిన ప‌చ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత నాన‌బెట్టుకున్న బియ్యం, త‌రిగిన పుదీనా, కొత్తిమీర‌, ఉప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోసి కలిపి ఉడికించాలి. ఇప్పుడు మ‌రో క‌ళాయిలో నూనె వేసి కాగాక జీడిప‌ప్పు, ప‌చ్చి మిర్చిని వేసి ముందుగా ఉప్పు, కారం క‌లిపి పెట్టుకున్న చికెన్ ను వేసి మ‌ధ్య‌స్ధ మంటపై కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ పూర్తిగా వేగిన త‌రువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మ‌తి బియ్యాన్ని తీసుకుని ఈ ముక్క‌ల‌పై వేసి కొద్దిగా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా లేదా మిర్చి కా సాల‌న్, రైతాల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Chicken Fry Piece Biryani
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Harati : క‌ర్పూరం, ల‌వంగాల‌తో ఇలా హార‌తి ఇవ్వండి చాలు.. ఐశ్వ‌ర్య‌వంతులు అవుతారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.