Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Tamarind : చింత‌పండును కేవ‌లం వంట‌ల‌కే కాదు, ఈ ప‌నులకు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు..!

Editor by Editor
August 28, 2024
in Home Tips, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Tamarind : చింత‌పండును మ‌నం నిత్యం అనేక వంట‌ల్లో వేస్తుంటాం. చింత‌పండును అనేక ర‌కాల ప‌ప్పుల‌లో పులుపు కోసం వేస్తుంటారు. దీంతో ర‌సం, సాంబార్‌, ప‌ప్పుచారు చేస్తుంటారు. అలాగే చింత‌పండుతో చేసే పులిహోర అంటే ఎంతో మందికి ఇష్టం. చింత‌కాయ ప‌చ్చ‌డి అయితే చెప్ప‌లేనంత టేస్ట్‌గా ఉంటుంది. ప్ర‌త్యేకంగా దీనికి అభిమానులు కూడా ఉంటారు. అయితే చింత‌పండును మనం కేవ‌లం వంట‌ల‌కే కాదు, ప‌లు ఇత‌ర ప‌నుల‌కు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చింత‌పండు క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా ప‌నిచేస్తుంది. నిమ్మ‌లాగే చింత‌పండులోనూ స్ట్రాంగ్ యాసిడ్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల చింత‌పండుతో వేటినైనా స‌రే క్లీన్ చేయ‌వ‌చ్చు. ముఖ్యంగా వంట‌పాత్ర‌లు లేదావెండి సామాన్ల‌ను దీంతో క్లీన్ చేయ‌వ‌చ్చు. దీంతో అవి మెరుస్తాయి. అలాగే చింత‌పండులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి క‌నుక చింత‌పండుతో వంట‌పాత్ర‌ల‌ను తోమితే దాంతో వంట‌పాత్ర‌ల‌పై ఉండే క్రిములు న‌శిస్తాయి. దీని వ‌ల్ల రోగాలు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అయితే చింత‌పండును కాసేపు నీటిలో నాన‌బెట్టి అందులో కాస్త ఉప్పు క‌లిపి వాడితే ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
here it is how you can use Tamarind other than cooking
Tamarind

దోమ‌ల‌, ఈగలు, పురుగుల‌ను త‌రిమేందుకు..

మీ ఇంట్లో ఈగ‌లు, దోమ‌లు, పురుగులు, బొద్దింక‌లు ఎక్కువ‌గా తిరుగుతున్నాయా. అయితే వాటిని త‌రిమేందుకు కూడా చింత‌పండు ప‌నిచేస్తుంది. చింత పండు పేస్ట్‌ను అవి తిరిగే చోట్ల ఉంచితే చాలు, చింత‌పండు నుంచి వ‌చ్చే వాస‌న‌కు అవి పారిపోతాయి. దీంతో ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఆహారం కూడా ఫుడ్ పాయిజ‌న్ కాకుండా ఉంటుంది. అలాగే మీకు ఇంట్లో స‌బ్బును త‌యారు చేయ‌డం తెలిస్తే అందులో చింత‌పండు క‌లిపి త‌యారు చేయ‌వ‌చ్చు. అలా త‌యారు చేసిన స‌బ్బును వాడితే మీ చ‌ర్మానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ముఖంపై ఉండే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు పోతాయి.

చింత‌పండులో టానిన్స్ అన‌బ‌డే స‌మ్మేళ‌నాలు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల చింత‌పండు కాట‌న్‌, ఉన్ని, ఇత‌ర వ‌స్త్రాల‌కు బాగా అంటుకుంటుంది. అందువ‌ల్ల చింత‌పండును మీరు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఎకో ఫ్రెండ్లీ డై గా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. చింత‌పండుతో చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షించుకోవ‌చ్చు. చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చ‌ర్మానికి మెరుపును తెస్తాయి. అలాగే శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. చుండ్రును త‌గ్గిస్తాయి. ఇలా చింత‌పండును మ‌నం కేవ‌లం వంట‌ల‌కు మాత్ర‌మే కాకుండా ప‌లు ఇత‌ర విధాలుగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

Tags: tamarind
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Viparita Karani : రోజూ కేవ‌లం 5 నిమిషా పాటు ఈ ఆస‌నం వేస్తే చాలు.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.