Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Aloo Kurma : హోట‌ల్స్‌లో అందించే ఆలు కుర్మా.. ఇలా చేయండి..ఎంతో టేస్టీగా ఉంటుంది..!

D by D
October 20, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Aloo Kurma : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తోచేసే వంట‌కాల్లో ఆలూ కుర్మా కూడా ఒక‌టి. ఆలూ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఆలూ కుర్మా కూడా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కుర్మాను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దేనితోనైనా తిన‌డానికి వీలుగా ఉండే రుచిక‌ర‌మైన ఆలూ కుర్మాను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, సాజీరా – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు – 2, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి 2, క్యూబ్స్ లాగా త‌రిగిన బంగాళాదుంప‌లు – 2, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Kurma recipe in telugu make it in hotel style
Aloo Kurma

ఆలూ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి క‌లిపి మూత పెట్టాలి. వీటిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ట‌మాట ముక్క‌లు పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి వీటిలో మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి బంగాళాదుంప ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ముక్క‌లు ఉడికి కూర ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కుర్మా త‌యార‌వుతుంది. దీనిని అన్న‌, చ‌పాతీ, రోటీ, బ‌గారా అన్నం వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Aloo Kurma
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Vegetable Juice For Diabetes : రోజూ దీన్ని తాగితే చాలు.. డ‌యాబెటిస్ అన్న‌ది మీ జీవితంలో ఉండ‌దు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.