Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Apple Jam : బ‌య‌ట షాపుల్లో ల‌భించే యాపిల్ జామ్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

D by D
October 23, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Apple Jam : ఆపిల్ జామ్.. పిల్ల‌లు దీనిని ఇష్టంగా తింటారు. బ్రెడ్, చ‌పాతీ, పూరీ వంటి వాటితో తిన‌డానికి ఈ జామ్ చాలా రుచిగా ఉంటుంది. సాధార‌ణంగా ఈ జామ్ ను మ‌నం బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే బ‌య‌ట త‌యారు చేసే ఈ జామ్ లో నిల్వ ఉండ‌డానికి ఫ్రిజ‌ర్వేటివ్స్ ను క‌ల‌ప‌డంతో పాటు క‌ల‌ర్ ఫుల్ గా క‌న‌బ‌డ‌డానికి ఫుడ్ క‌ల‌ర్స్ ను కూడా క‌లుపుతూ ఉంటారు. అయితే ఇలా క‌ల‌ర్స్, ఫ్రిజ‌ర్వేటివ్స్ ఏమి క‌ల‌ప‌కుండా కూడా మ‌నం జామ్ ను ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఆపిల్ జామ్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇంట్లోనే ఎటువంటి క‌ల‌ర్స్, ఫ్రిజ‌ర్వేటివ్స్ లేకుండా ఆపిల్ జామ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్ జామ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ఆపిల్స్ – ముప్పావుకిలో, బీట్ రూట్ – చిన్న‌ది ఒక‌టి, పంచ‌దార – ముప్పావు క‌ప్పు, ఉప్పు – చిటికెడు, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్.

Apple Jam recipe in telugu very easily you can make
Apple Jam

ఆపిల్ జామ్ త‌యారీ విధానం..

ముందుగా ఆపిల్స్ లో ఉండే గింజ‌ల‌ను తీసేసి చిన్న‌ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత బీట్ రూట్ పై ఉండే తొక్క‌ను తీసేసి దానిని కూడా ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను ఆవిరి మీద 10 నిమిషాల పాటు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను స్ట్రెయిన‌ర్ లో వేసి స్పూన్ తో వ‌త్తుతూ వ‌డ‌క‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మెత్త‌ని పేస్ట్ తో మాత్ర‌మే మనం జామ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రువాత ఈ పేస్ట్ ను క‌ళాయిలో వేసి అందులోనే పంచ‌దార వేసి క‌లుపుతూ ఉడికించాలి.

ఈ జామ్ ను మ‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని జామ్ లా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించాలి. ఈ మిశ్ర‌మం చిక్క‌గా అయిన త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆపిల్ జామ్ త‌యార‌వుతుంది. దీనిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా మన ఇంట్లోనే చాలా రుచిగా ఎలాంటి ఫ్రిజ‌ర్వేటివ్స్ లేకుండా ఆపిల్ జామ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Apple Jam
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

మ‌ట‌న్ ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.