Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Atukula Rava Kesari : అటుకుల‌తో ర‌వ్వ కేస‌రి త‌యారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

D by D
February 23, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Atukula Rava Kesari : అటుకుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకుల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో అటుకుల ర‌వ్వ కేసరి కూడా ఒక‌టి. అటుకుల‌తో చేసే ఈ ర‌వ్వ కేస‌రి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా ఉడిపి ప్రాంతంలో త‌యారు చేస్తారు. క్రిష్ణాష్ట‌మికి దీనిని త‌యారు చేసి నైవేధ్యంగా స‌మర్పిస్తూ ఉంటారు. కేవ‌లం నైవేద్యంగానే కాకుండా తీపి తినాలనిపించిన‌ప్పుడు కూడా దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ ర‌వ్వ కేస‌రిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. చాలా తేలిక‌గా, చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా అటుకుల‌తో ర‌వ్వ కేస‌రిని ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

అటుకుల ర‌వ్వ కేస‌రి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మంద‌పాటి అటుకులు – ఒక క‌ప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – 3 టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 2 క‌ప్పులు, పంచ‌దార – ముప్పావు క‌ప్పు నుండి ఒక క‌ప్పు, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, ప‌చ్చ‌క‌ర్పూరం – చిటికెడు.

Atukula Rava Kesari recipe very tasty make like this
Atukula Rava Kesari

అటుకుల ర‌వ్వ కేస‌రి త‌యారీ విధానం..

ముందుగా అటుకుల‌ను క‌ళాయిలో వేసి చిన్న మంటపై క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి ర‌వ్వ‌లాగా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక జీడిప‌ప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత అటుకుల ర‌వ్వ వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. ఇందులోనే క‌ల‌ర్ వేసిక‌ల‌పాలి. దీనిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత యాల‌కుల పొడి, ప‌చ్చ‌క‌ర్పూరం, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల ర‌వ్వ కేసరి త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు అటుకుల‌తో కేస‌రిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Atukula Rava Kesari
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

10 Calcium Rich Foods : ఈ 10 ఆహారాల‌ను రోజూ తీసుకోండి.. బోలెడంత కాల్షియం పొంద‌వ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.