Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Catering Style Chicken Fry : క్యాట‌రింగ్ స్టైల్‌లో చికెన్ ఫ్రై.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

D by D
February 27, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Catering Style Chicken Fry : చికెన్ తో చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చికెన్ ఫ్రైను వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే క్యాట‌రింగ్ స్టైల్ చికెన్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా క్యాట‌రింగ్ వాళ్లు ఫంక్ష‌న్ ల‌లో త‌యారు చేస్తూ ఉంటారు. ఈ చికెన్ ఫ్రైను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క్యాట‌రింగ్ స్టైల్ లో రుచిగా చికెన్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాట‌రింగ్ స్టైల్ చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

చికెన్ మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – 3 రెమ్మ‌లు, పెరుగు – 2 లేదా 3 టేబుల్ స్పూన్, క‌సూరిమెంతి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Catering Style Chicken Fry recipe make like this for taste
Catering Style Chicken Fry

క్యాట‌రింగ్ స్టైల్ చికెన్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో చికెన్ ను తీసుకోవాలి. త‌రువాత మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి అర‌గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత ఈ క‌ళాయిని స్ట‌వ్ మీద ఉంచి చికెన్ ను వేయించాలి. చికెన్ లోని నీరంతా పోయే వ‌ర‌కు బాగా వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ముందుగా వేయించిన చికెన్, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు వేయించిన త‌రువాత క‌సూరిమెంతి, కారం, ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. చికెన్ పూర్తిగా వేగి నూనె పైకి తేలిన త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై త‌యారవుతుంది. దీనిని ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో తింటే మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన చికెన్ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Catering Style Chicken Fry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Diet In Fever : జ్వ‌రం వ‌చ్చి త‌గ్గిందా.. అయితే ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ కొద్ది రోజులు తిన‌కూడ‌దు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.