Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chicken Pachadi : చికెన్ ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎక్కువ రోజులు ఉన్నా ఏమీ కాదు..!

D by D
July 12, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chicken Pachadi : మ‌న‌లో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. చికెన్ తో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాల‌లో చికెన్ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. చికెన్ ప‌చ్చ‌డి ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ ప‌చ్చ‌డిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ ప‌చ్చ‌డి మ‌న‌కు బ‌య‌ట కూడా దొరుకుతుంది. దీనిని మ‌నం చాలా సులువుగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బోన్ లెస్ చికెన్ – అర కిలో, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – 150 ఎంఎల్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, ల‌వంగాలు – 5, ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టేబుల్ స్పూన్, మెంతులు – పావు టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – పావు క‌ప్పు, కారం – పావు క‌ప్పు, నిమ్మ‌కాయ‌లు – 2 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి).

Chicken Pachadi very tasty if you make it like this
Chicken Pachadi

చికెన్ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసిన బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా క‌డిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పును, ప‌సుపును వేసి క‌లిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక క‌ళాయిలో ల‌వంగాల‌ను, దాల్చిన చెక్క‌ను, యాల‌కుల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ధ‌నియాల‌ను, ఆవాల‌ను, జీల‌క‌ర్ర‌ను, మెంతుల‌ను వేసి దోర‌గా వేయించాలి. ఇవి అన్నీ చ‌ల్ల‌గా అయిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడి అయ్యేలా మిక్సీ ప‌ట్టుకోవాలి.

ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత ముందుగా ఉప్పు, ప‌సుపు వేసి క‌లిపి పెట్టుకున్న చికెన్ ను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేయించుకోవాలి. ఈ చికెన్ ను పూర్తిగా ఉడికి పై భాగం క‌ర‌క‌ర‌లాడుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇలా వేయించిన త‌రువాత చికెన్ ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ముందుగా ప్లేట్ లోకి తీసుకున్న చికెన్ ను మ‌ళ్లీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి నుండి ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్ మ‌సాలా పొడిని, ఉప్పును, కారాన్ని కూడా వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి.

ఇలా క‌లిపిన త‌రువాత చికెన్ నుండి నురుగు బ‌య‌టకు వ‌స్తుంది. నురుగు రాగానే స్ట‌వ్ ఆఫ్ చేయాలి. త‌రువాత నిమ్మ‌కాయ‌ల‌ను కోసి ప‌చ్చ‌డిలో ర‌సాన్ని పిండి బాగా క‌ల‌పాలి. ఈ ప‌చ్చడి చ‌ల్ల‌గా అయిన త‌రువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల మూడు నెల‌ల పాటు తాజాగా ఉంటుంది. బ‌య‌ట ఎక్కువ ధ‌ర‌కు ఈ చికెన్ ప‌చ్చ‌డిని కొనుగోలు చేయ‌డానికి బదులుగా ఇలా ఇంట్లోనే మ‌నం రుచిగా దీన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Chicken Pachadi
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Kamanchi Plant : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా.. ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.