Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Biscuits : ఓవెన్ లేకున్నా.. గుడ్డు ఉప‌యోగించ‌కుండా.. బిస్కెట్ల‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

D by D
August 13, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Biscuits : మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో, బేక‌రీల్లో వివిధ రుచుల్లో అనేక ర‌కాల బిస్కెట్లు ల‌భ్య‌మ‌వుతుంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఈ బిస్కెట్ల‌ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే అంద‌రి ఇండ్లల్లో ఓవెన్ ఉండ‌దు. ఓవెన్ అవ‌స‌రం లేకుండా అదే విధంగా కోడిగుడ్డును ఉప‌యోగించ‌కుండా ఇంట్లో రుచిగా బిస్కెట్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బిస్కెట్ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మైదాపిండి – ఒక క‌ప్పు, శ‌న‌గ‌పిండి – పావు క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – 2 టేబుల్ స్పూన్స్, పంచ‌దార పొడి – ముప్పావు క‌ప్పు, ఉప్పు – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడ‌ర్ – పావు టీ స్పూన్, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, నెయ్యి – అర క‌ప్పు.

how to make Biscuits at home very simple method
Biscuits

బిస్కెట్ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నెయ్యి త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత నెయ్యిని వేసి పిండి ముద్ద‌లా అయ్యే విధంగా 5 నుండి 10 నిమిషాల పాటు బాగా క‌ల‌పాలి. త‌రువాత అడుగు భాగం మందంగా ఉండే ఒక గిన్నెను తీసుకుని స్ట‌వ్ మీద ఉంచాలి. ఈ గిన్నెలో ఒక స్టాండును ఉంచి వేడి బ‌య‌ట‌కు పోకుండా మూతను ఉంచి 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై వేడి చేయాలి. త‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని స‌మ‌భాగాల్లో తీసుకుంటూ ఉండ‌లుగా చేసుకోవాలి.

త‌రువాత ఈ ఉండ‌ల‌ను మందంగా బిస్కెట్ల ఆకారంలో వ‌త్తుకోవాలి. ఈ బిస్కెట్ల‌ను నెయ్యి రాసిన అల్యూమినియం ప్లేట్ లో లేదా గిన్నెలో ఉంచాలి. త‌రువాత ఈ బిస్కెట్ల పై మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో గుర్తుల‌ను అదే విధంగా మ‌న‌కు న‌చ్చిన డ్రై ఫ్రూట్స్ తురుమును ఉంచాలి. ఇలా అన్నీ బిస్కెట్ల‌ను త‌యారు చేసుకున్న త‌రువాత ఈ బిస్కెట్ల పేట్ల్ ను ముందుగా వేడి చేసుకున్న గిన్నెలో స్టాండ్ పై ఉంచి వేడి బ‌య‌ట‌కు పోకుండా మూత పెట్టాలి. ఈ బిస్కెట్ల‌ను 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై వేడి చేయాలి.

ఇలా వేడి చేసిన త‌రువాత బిస్కెట్లు పెద్ద‌గా అవ్వడంతోపాటు రంగు మార‌డాన్ని కూడా మనం గ‌మ‌నించ‌వ‌చ్చు. బిస్కెట్ల అడుగు భాగం కూడా ఎర్ర‌గా రంగు మారుతుంది. ఇప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి బిస్కెట్ల‌ను బ‌య‌ట‌కు తీయాలి. ఈ బిస్కెట్ల‌ను చ‌ల్ల‌గా అయిన త‌రువాత వేరే ప్లేట్ లోకి లేదా గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లు త‌యార‌వుతాయి.

అడుగు భాగం ప‌లుచ‌గా ఉండే గిన్నెను తీసుకున్న వారు గిన్నెలో ఉప్పును లేదా ఇసుక‌ను ఉంచి దానిపై స్టాండ్ ను ఉంచాలి. ఈ విధంగా ఇంట్లో ఓవెన్ లేక‌పోయినా అలాగే కోడిగుడ్డును ఉప‌యోగించ‌కున్నా.. రుచిగా ఉండే బిస్కెట్ల‌ను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసిన బిస్కెట్లు అచ్చం బ‌య‌ట దొరికే విధంగా ఉండే బిస్కెట్ల రుచిని క‌లిగి ఉంటాయి. అంద‌రూ ఈ బిస్కెట్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: biscuits
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Head Bath : ఏరోజు త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.