Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Pachi Mirchi Tomato Pappu : అన్నంలోకి ప‌చ్చి మిర్చి ట‌మాటా ప‌ప్పును ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

D by D
October 27, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Pachi Mirchi Tomato Pappu : ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పు.. ప‌చ్చిమిర్చి, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే ట‌మాట ప‌ప్పు కంటే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. జొన్న రొట్టెతో తిన‌డానికి ఈ ప‌ప్పు చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసయ‌డం కూడా చాలా సుల‌భం. కేవ‌లం 20 నిమిషాల్లోనే ఈ ప‌ప్పును చాలా సుల‌భంగా, రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. లొట్ట‌లేసుకుంటూ తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

కందిప‌ప్పు – అర క‌ప్పు, నీళ్లు – 3 క‌ప్పులు, ప‌చ్చిమిర్చి – 10 నుండి 15, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ట‌మాటాలు – 3, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, చింత‌పండు – చిన్న ఉసిరికాయంత‌, నూనె – ఒక టీ స్పూన్.

Pachi Mirchi Tomato Pappu recipe in telugu very tasty
Pachi Mirchi Tomato Pappu

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 3, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో ప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి కుక్క‌ర్ మూత పెట్టాలి. త‌రువాత ఈ ప‌ప్పును 4 నుండి 5 విజిల్స్ వ‌చ్చే ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి ఉప్పు వేసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు చ‌క్కగా వేగిన తరువాత ప‌ప్పు వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ప‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Pachi Mirchi Tomato Pappu
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

How To Use Coconut Oil : జుట్టు పెర‌గాలంటే.. కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.