Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Punjabi Gobi Paratha : పంజాబీ స్టైల్‌లో గోబీ ప‌రాటా.. ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

D by D
September 5, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Punjabi Gobi Paratha : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో ప‌రాటాలు కూడా ఒక‌టి. గోధుమ‌పిండితో చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మ‌నం వివిధ రుచుల్లో ఈ ప‌రాటాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మనం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన పరాటాల‌ల్లో గోబి ప‌రాటా కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే ప‌రాటాలు మెత్త‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అల్పాహారంగా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ ప‌రాటాల‌ను ఒక్క‌టి తింటే చాలు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పంబాజి గోబి ప‌రాటాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పంజాబి గోబి ప‌రాటా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, నెయ్యి- ఒక టీ స్పూన్, స‌న్న‌గా తురిమిన క్యాలీప్ల‌వ‌ర్ – 100 గ్రా., చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 3, కారం – అర టీస్పూన్, చిన్న‌గా తరిగిన ప‌చ్చిమిర్చి – 1, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Punjabi Gobi Paratha recipe in telugu make in this method
Punjabi Gobi Paratha

పంజాబి గోబి ప‌రాటా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, నెయ్యి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత నీటిని పోస్తూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి అరగంట పాటు పిండిని నాన‌బెట్టుకోవాలి. త‌రువాత క్యాలీప్ల‌వ‌ర్ తురుమును ఒక వ‌స్త్రంలో వేసి నీరంతా పోయేలా గ‌ట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు పిండిని స‌మానంగా ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ ముందుగా చేత్తో వెడ‌ల్పుగా వ‌త్తుకోవాలి.

త‌రువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల క్యాలీప్ల‌వ‌ర్ మిశ్ర‌మాన్ని ఉంచి అంచుల‌ను మూసి వేయాలి. త‌రువాత పొడి పిండి చ‌ల్లుకుంటూ మందంగా ప‌రోటాలా వ‌త్తుకోవాలి. ఇలా వ‌త్తుకున్న ప‌రాటాను వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. త‌రువాత నూనె లేదా బ‌ట‌ర్ వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పంబాజి గోబి ప‌రాటాలు త‌యార‌వుతాయి. వీటిని ఆవ‌కాయ‌, రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా తీసుకోవ‌డంతో పాటు లంచ్ బాక్స్ లోకి కూడా ఈ ప‌రాటాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి.

Tags: Punjabi Gobi Paratha
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Tomato Kaju Masala : ట‌మాటా కాజు మ‌సాలా కూర‌.. అన్నం, చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.