Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Rava Chocolate Burfi : ర‌వ్వ చాకొలెట్ బ‌ర్ఫీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

D by D
January 2, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Rava Chocolate Burfi : రవ్వ చాక్లెట్ బ‌ర్ఫీ.. ర‌వ్వ‌తో చేసే ఈ బ‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు, స్పెషల్ డేస్ లో, పండ‌గ‌ల‌కు ఇలా బ‌ర్ఫీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అలాగే చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ బ‌ర్ఫీని త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు ఈ బ‌ర్ఫీని అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. ఎంతో రుచిగా, మృదువుగా ఉండే ర‌వ్వ చాక్లెట్ బ‌ర్పీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌వ్వ చాక్లెట్ బ‌ర్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బొంబాయి ర‌వ్వ – అర క‌ప్పు, బాదంప‌ప్పు – 6, జీడిప‌ప్పు – 6, యాల‌కులు – 3, కోకో పౌడ‌ర్ – 2 టీ స్పూన్స్, కాచి చ‌ల్లార్చిన పాలు – పావు క‌ప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, పాలు – ఒక‌టింపావు క‌ప్పు, పంచ‌దార – అర క‌ప్పు.

Rava Chocolate Burfi recipe make in this way
Rava Chocolate Burfi

ర‌వ్వ చాక్లెట్ బ‌ర్ఫీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ర‌వ్వ‌, బాదంప‌ప్పు, జీడిపప్పు, యాల‌కులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో కోకో పౌడ‌ర్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో కాచిచ‌ల్లార్చిన పాలు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత గిన్నెలో పాలు పోసి స్ట‌వ్ మీద ఉంచి వేడి చేయాలి. పాలు వేడ‌వుతుండ‌గానే మ‌రో స్ట‌వ్ మీద క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ర‌వ్వ వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత మ‌రో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి క‌ల‌పాలి. ర‌వ్వ చ‌క్క‌గా వేగిన త‌రువాత మ‌రిగిస్తున్న పాల‌ను పోసి క‌ల‌పాలి. ర‌వ్వ ఉడికి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ర‌లా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత ఇందులో ముందుగా సిద్దం చేసుకున్న కోకో మిశ్ర‌మాన్ని వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసిన ట్రే లేదా ప్లేట్ లోకి తీసుకుని పైన స‌మానంగా చేసుకోవాలి. ఈ ర‌వ్వ మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత గిన్నె నుండి అంచుల‌ను వేరు చేసి నెమ్మ‌దిగా ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత దీనిని మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వీటిపై బాదంప‌ప్పు ప‌లుకుల‌ను ఉంచి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ చాక్లెట్ బ‌ర్ఫీ త‌యార‌వుతుంది. దీనిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలైతే మ‌రింత ఇష్టంగా తింటారు.

Tags: Rava Chocolate Burfi
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Shampoo With Soap Nuts : కుంకుడు కాయ‌ల‌ను ఇలా షాంపూగా చేసుకుని వాడండి.. ఎంతో గొప్ప రిజ‌ల్ట్ వ‌స్తుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.