Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Restaurant Style Chicken 65 : చికెన్ 65ని ఇలా చేస్తే.. రెస్టారెంట్ స్టైల్‌లో వ‌స్తుంది.. ఎంతో రుచిగా ఉంటుంది..

D by D
December 23, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Restaurant Style Chicken 65 : చికెన్ తో ఎంతో రుచిక‌ర‌మైన వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ 65 ఒక‌టి. ఇది మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతుంది. చికెన్ 65 చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ 65 ని మ‌నం ఇంట్లో కూడా అదే రుచితో త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ 65 ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

చికెన్ – 350 గ్రా., కోడిగుడ్డు – 1, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిపడా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, రెడ్ ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు.

Restaurant Style Chicken 65 recipe in telugu make in this way
Restaurant Style Chicken 65

రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో నూనె, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. త‌రువాత చికెన్ ను బ‌య‌ట‌కు తీసి మ‌రోసారి అంతా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చికెన్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌రక‌ర‌లాడుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే నూనెలో ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించి చికెన్ మీద చ‌ల్లుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 త‌యార‌వుతుంది. చికెన్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా చికెన్ 65 ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ చికెన్ 65 ను ఒక్క ముక్క కూడా విడిచి పెట్ట‌కుండా అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Restaurant Style Chicken 65
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Kodiguddu Porutu : కోడిగుడ్డు పొరుటు గురించి తెలుసా.. ఇలా చేసుకోవ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.