Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Veg Dum Biryani Recipe : వెజ్ ద‌మ్ బిర్యానీ.. ఈజీగా ఇలా చేయొచ్చు.. ఒక్క ముద్ద కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..

D by D
November 9, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Veg Dum Biryani Recipe : బిర్యానీ.. ఈ పేరు వింటేనే మ‌న‌లో చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. చికెన్, మ‌ట‌న్ వంటి వాటితోనే కాకుండా వెజిటేబుల్స్ తో కూడా బిర్యానీని త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే హైద‌రాబాదీ వెజ్ ద‌మ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హైద‌రాబాదీ వెజ్ ద‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

త‌రిగిన బంగాళాదుంపలు – 2, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – 6, ప‌సుపు – అర‌ టీ స్పూన్, పెద్ద‌గా త‌రిగిన క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు – 10, ఉప్పు – త‌గినంత‌, వేడి నీటిలో నాన‌బెట్టిన ప‌చ్చిబ‌ఠాణీ – అర క‌ప్పు, వేయించిన ఉల్లిపాయ‌లు – పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 5, యాల‌కులు – 4, కారం – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, నిమ్మ‌ర‌సం – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – అర క‌ప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

Veg Dum Biryani Recipe in telugu know how to make easy way
Veg Dum Biryani Recipe

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన బాస్మతీ బియ్యం – ఒక‌టిన్న‌ర క‌ప్పు, నీళ్లు – 2 లీట‌ర్లు, సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 6, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌, యాల‌కులు – 6, న‌ల్ల యాల‌క్కాయ – 1, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1, ఉప్పు – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2.

హైద‌రాబాదీ వెజ్ ద‌మ్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. త‌రువాత అందులో బంగాళాదుంప‌, క్యారెట్, క్యాలీప్ల‌వ‌ర్, ఫ్రెంచ్ బీన్స్ ముక్క‌లు వేయాలి. ఇందులోనే ఉప్పు, పావు టీ స్పూన్ ప‌సుపు వేసి ఈ ముక్క‌లను 70 శాతం వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను వేరే గిన్నెలోకి తీసుకుని అందులో చ‌ల్ల‌టి నీటిని పోసి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను అడుగు భాగం మందంగా ఉండే ఒక క‌ళాయిలో తీసుకోవాలి. త‌రువాత ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. ఈ క‌ళాయిపై మూత‌ను ఉంచి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి.

ఇందులోనే బియ్యం త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బాస్మ‌తి బియ్యాన్ని వేసి 70 శాతం వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన అన్నాన్ని ముందుగా త‌యారు చేసుకున్న కూర‌గాయ‌ల మిశ్ర‌మం మీద పొర‌లు పొర‌లుగా వేసుకోవాలి. త‌రువాత బియ్యం ఉడికించిన నీటిని 50 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకుని క‌ళాయి అంచుల చుట్టూ చ‌ల్లాలి. త‌రువాత ఈ అన్నంపై అర టీ స్పూన్ గ‌రం మ‌సాలాను చ‌ల్లాలి. త‌రువాత పాల‌ల్లో నాన‌బెట్టిన కుంకుమ పువ్వును చ‌ల్లాలి. కుంకుమ పువ్వు అందుబాటులో లేని వారు ఫుడ్ క‌ల‌ర్ ను వేసుకోవ‌చ్చు. అలాగే ఒక టీ స్పూన్ కొత్తిమీర‌ను, 2 టేబుల్ స్పూన్ల‌ ఫ్రైడ్ ఆనియ‌న్స్ ను, 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా చ‌ల్లుకోవాలి.

త‌రువాత వీటిపై టిష్యూ పేప‌ర్ ల‌ను ఉంచి వాటిపై కొద్దిగా నీటిని చ‌ల్లాలి. ఇప్పుడు ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా మూత పెట్టి 8 నిమిషాల పాటు మ‌ధ్యస్థ మంట‌పై, 7 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైద‌రాబాదీ వెజ్ ద‌మ్ బిర్యానీ త‌యార‌వుతుంది. ఈ బిర్యానీని మిర్చి కా సాల‌న్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Veg Dum Biryani
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Fat Reducing Drink : రోజుకు 3 సార్లు దీన్ని తాగితే చాలు.. పొట్ట‌, న‌డుము, తొడ‌ల ద‌గ్గ‌ర ఉండే కొవ్వు క‌రుగుతుంది..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.