Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Wheat Flour Chips : గోధుమ పిండితో ఎంతో రుచిక‌ర‌మైన చిప్స్.. త‌యారీ ఇలా..!

D by D
August 2, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Wheat Flour Chips : గోధుమ‌పిండితో మ‌నం చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో గోధుమ‌పిండి చిప్స్ కూడా ఒక‌టి. గోధుమ‌పిండితో చేసే ఈ చిప్స్ క‌ర‌క‌రలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. టీ టైం స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అలాగే పిల్ల‌ల‌కు బాక్స్ లో స్నాక్స్ గా కూడా వీటిని పెట్ట‌వ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ గోధుమ‌పిండి చిప్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమపిండి చిప్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – అర క‌ప్పు, మైదాపిండి – ఒక క‌ప్పు, ఉప్పు -త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్, వాము -ఒక టీ స్పూన్, నెయ్యి లేదా బ‌ట‌ర్ – అర టేబుల్ స్పూన్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Wheat Flour Chips recipe in telugu make in this method
Wheat Flour Chips

గోధుమ‌పిండి చిప్స్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి క‌ల‌పాలి. తరువాత నెయ్యి లేదా బ‌ట‌ర్ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండి కంటే గ‌ట్టిగా పిండిని క‌లుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పిండిని 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. పిండి చ‌క్క‌గా నానిన‌ త‌రువాత ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండిని చ‌ల్లుకుంటూ ప‌లుచ‌గా చ‌పాతీలా వ‌త్తుకోవాలి. త‌రువాత క‌త్తితో డైమండ్ ఆకారంలో లేదా మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో క‌ట్ చేసుకోవాలి.

ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌ట్ చేసుకున్న చిప్స్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి చిప్స్ త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 20 రోజుల పాటు తాజాగా ఉంటాయి. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Wheat Flour Chips
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Shahi Paneer Kurma : రెస్టారెంట్ల‌లో ల‌భించే షాహి ప‌నీర్ కుర్మా.. ఇంట్లో చేసినా రుచిగా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.