రూ.10 నాణేలను నిజంగా రద్దు చేశారా..? ఎందుకు వాటిని తీసుకోవడం లేదు..?
మన దేశంలోనే కాదు, ఎక్కడైనా ఓ పుకారు వచ్చిందంటే చాలు అది దావానలం కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఒకానొక సందర్భంలో ఆ పుకారునే చాలా మంది నిజం అని నమ్ముతారు. ఇక ఇటీవలి కాలంలో సోషల్ మీడియా హల్‌చల్ ఎలా ఉందో తెలిసిందే. ఈ క్రమంలో ఎవరైనా ఏదైనా ఒక పుకారు సృష్టించారంటే చాలు కొన్ని నిమిషాలు, గంటల్లోనే అది వైరల్ అవుతోంది. అలా వైరల్‌గా మారిన టాపిక్ ఏంటంటే… అదేనండీ… రూ.10 నాణేలు……