వినాయకుడి పూజలో తులసిని ఎందుకు ఉపయోగించరో తెలుసా ?
హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ క్రమంలోనే శ్రీహరిని తులసి మాలతో పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కను వినాయకుడి పూజలో ఉపయోగించరు. అంత పవిత్రమైన మొక్కను వినాయకుడి పూజలో ఉపయోగించకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడు గంగానది తీరంలో కూర్చుని తపస్సు చేస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి…