Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

Snake Island : బాబోయ్‌.. ఆ దీవి నిండా పాములే.. అడుగు తీసి అడుగు పెట్టలేం..!

Admin by Admin
December 28, 2024
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Snake Island : సాధారణంగా దీవి అంటే అద్భుతమైన ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. సుందరమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం బీచ్‌లో ఉంటుంది. కానీ ఆ దీవి పేరు చెబితే చాలు.. ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఆ దీవి నిండా పాములే. అడుగు తీసి అడుగు పెట్టలేం. ఇంతకీ ఏంటా దీవి ? ఎక్కడ ఉంది ? అంటే..

బ్రెజిల్‌లోని సావో పౌలో సిటీకి 90 మైళ్ల దూరంలో Ilha de Queimada Grande అనే దీవి ఉంది. దీన్నే స్నేక్‌ ఐల్యాండ్‌ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ దీవిలో అన్నీ పాములే ఉంటాయి. ప్రతి మూడు అడుగుల దూరానికి ఒక పాము కనిపిస్తుంది. సాధారణంగా మనకు బయట కనిపించే పాముల కన్నా ఈ దీవిలో ఉండే పాములకు మూడు నుంచి ఐదు రెట్ల విషం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ దీవిలో గోల్డెన్‌ లాన్స్‌హెడ్‌ అనే ఓ రకానికి చెందిన పాము ఉంటుంది. దీని విషం ఎంతటి ప్రమాదకరం అంటే.. అది ఏకంగా మన చర్మాన్ని కరిగిస్తుంది. అంతటి పవర్‌ ఉంటుంది.

there are lot of snakes in that island

మరి ఇన్ని పాములు ఉన్న ఆ దీవిలో మనుషులు ఎవరూ ఉండరా ? అంటే.. ఉండేవారు. అది 1920లలో. అప్పట్లో ఈ దీవి సమీపంలో ఉన్న భూభాగానికి ఆనుకుని ఉండేది. కానీ సముద్ర మట్టం పెరిగి ఈ దీవి ఆ భూభాగం నుంచి విడిపోయింది. దీంతో ఈ దీవిలో మనుషులు నివాసం ఉండేవారు కాదు. ఆ తరువాత అక్కడ పాముల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ అప్పట్లో ఈ దీవిలో ఉన్న లైట్‌ హౌజ్‌కు దగ్గర్లో ఓ ఇంట్లో ఓ కుటుంబం నివాసం ఉండేది. వారు పాములు కుట్టడం వల్ల రాత్రికి రాత్రే అందరూ చనిపోయారు. దీంతో అప్పటి నుంచి ఈ దీవికి ఎవరూ వెళ్లడం లేదు.

అయితే లైట్‌ హౌజ్‌ మెయింటెనెన్స్‌ కోసం అప్పుడప్పుడు నేవీ వారు అత్యంత జాగ్రత్తగా ఈ దీవికి వస్తుంటారు. అలాగే సైంటిస్టులు కూడా ఈ దీవిలోని పాములపై పరిశోధనలు చేసేందుకు కూడా ఈ దీవికి ప్రత్యేక అనుమతితో వస్తుంటారు. అందువల్ల ఈ దీవికి ఎవర్నీ వెళ్లనివ్వడం లేదు.

ఇక ఈ దీవిలో ప్రపంచంలోని పలు అరుదైన రకాలకు చెందిన అత్యంత విషపూరితమైన పాములు కూడా కొన్ని ఉన్నాయి. ఆ విషం చాలా ప్రమాదకరమైంది. దాంతో మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దీవి విస్తీర్ణం 43 హెక్టార్లు మాత్రమే కాగా.. ఇందులో సుమారుగా 4000 వరకు పాములు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

కాగా పైన తెలిపిన గోల్డెన్‌ లాన్స్‌హెడ్‌ అనే పాముకు చెందిన విషాన్ని కొన్ని లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ విషంతో గుండె జబ్బులు నయం చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఈ పాముల సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. కానీ ఈ దీవిలో ఉన్న ఇతర పాముల సంఖ్య మాత్రం బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ దీవిని తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది కదా..!

Tags: Snake Island
Previous Post

ఎలాంటి పెట్టుబ‌డి లేకుండానే మామిడి ఆకుల‌ను అమ్మి కూడా డ‌బ్బుల‌ను సంపాదించవ‌చ్చు.. ఎలాగో తెలుసా ?

Next Post

రావిచెట్టుకు వేపచెట్టుకు పెళ్లి ఎందుకు చేస్తారో తెలుసా?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.