Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Aloe Vera : క‌ల‌బంద‌తో కంటి చూపును ఇలా పెంచుకోవ‌చ్చు..!

D by D
July 7, 2022
in చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Aloe Vera : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది కంటి చూపు మంద‌గించ‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే భూత‌ద్దాల వంటి క‌ళ్ల‌జోడుల‌ను పెట్టుకునే పిల్ల‌ల‌ను మ‌నం చూస్తూనే ఉన్నాం. కంటిచూపు మంద‌గించ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. గంట‌ల త‌ర‌బ‌డి సెల్ ఫోన్ ల‌లో, కంప్యూట‌ర్ ల‌లో చిన్న చిన్న అక్ష‌రాల‌ను చూస్తూ ఉండ‌డం వ‌ల్ల, స‌రైన పోష‌కాహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వల్ల కంటి చూపు త‌గ్గుతుంది. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి వైద్యులు మ‌న‌కు కంటి అద్దాల‌ను కానీ, కాంటాక్ట్ లెన్సుల‌ను కానీ సూచిస్తారు. వీటిని ఉప‌యోగించే ప‌నిలేకుండా ఆయుర్వేదం ద్వారా మ‌నం ఈ కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు.

కంటిచూపు మంద‌గించిన వారు ఈ ఔష‌ధాన్ని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల కంటిచూపు మెరుగుప‌డి క‌ళ్ల‌ద్దాల‌ను ఉప‌యోగించే అవ‌స‌రం ఉండ‌దు. కంటిచూపును మెరుగుప‌రిచే ఆ ఔష‌ధం ఏమిటి.. దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డంలో మ‌న‌కు క‌ల‌బంద ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌ల‌బంద మ‌నంద‌రికీ తెలుసు. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డానికి క‌ల‌బంద‌ను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
you can increase your eye sight using Aloe Vera in this way
Aloe Vera

ఇందుకోసం ముందుగా చిల్ల గింజ‌ల‌ను తీసుకుని వాటిని శుభ్ర‌మైన త‌డిలేని మ‌ట్టిపాత్ర‌లో ఉంచాలి. ఈ గింజ‌లు మునిగే వ‌ర‌కు అందులో క‌ల‌బంద గుజ్జు ర‌సాన్ని పోయాలి. ఈ పాత్ర‌ను క‌దిలించ‌కుండా బాగా గాలి త‌గిలే ప్ర‌దేశంలో ఏడు నుండి ప‌ది రోజుల పాటు ఉంచాలి. మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ర‌సం అయిపోయిన‌ప్పుడ‌ల్లా ర‌సాన్ని పోస్తూ ఉండాలి. పాత్ర‌కు నీరు త‌గ‌ల‌కుండా కూడా చూసుకోవాలి. ప‌ది రోజుల త‌రువాత ఈ చిల్ల గింజ‌ల‌ను తీసి త‌డి లేకుండా శుభ్రంగా తుడవాలి. త‌రువాత వీటిని ఎండ‌లో దుమ్ము ప‌డ‌ని చోట ఉంచి బాగా ఎండబెట్టి వాటిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఈ గింజ‌ను ఒక దానిని తీసుకుని నీటితో కానీ ఒక చుక్క ఆవు నెయ్యితో కానీ మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని పెస‌ర‌గింజంత‌ ప‌రిమాణంలో తీసుకుని క‌ళ్ల‌ల్లో పెట్టుకుని నిద్ర‌పోవాలి. ఈ మిశ్ర‌మాన్ని పెట్టుకున్న వెంట‌నే క‌ళ్లు మంట పుట్ట‌డం స‌హ‌జం. ఉద‌యాన్నే క‌ళ్ల‌ను చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క‌డ‌గాలి.

ఇలా రెండు వారాల పాటు చేయ‌డం వల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది. కేవ‌లం కంటి చూపునే కాకుండా ఇత‌ర కంటి స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా క‌ల‌బంద మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. క‌ళ్ల‌ క‌ల‌క‌తో బాధ‌ప‌డే వారు 5 గ్రాముల క‌ల‌బంద గుజ్జును, ఒక గ్రాము ప‌టిక బెల్లం పొడిని తీసుకుని వాటి రెండింటిని క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని నూలు వ‌స్త్రానికి ప‌ట్టించి క‌ళ్లు మూసూకుని క‌ళ్ల‌పై ఉంచాలి. ఇలా చేస్తూ ఉండ‌డం వ‌ల్ల క‌ళ్ల‌క‌ల‌కతోపాటు కళ్ల ఎరుపు, కంటికి దెబ్బ త‌గ‌ల‌డం వ‌ల్ల క‌లిగే వాపు కూడా త‌గ్గుతాయి.

క‌ల‌బంద‌ను ఉప‌యోగించి మ‌రో విధంగా కూడా మ‌నం క‌ళ్ల‌క‌ల‌క స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కాలి బొట‌న వేలుకు స‌రిప‌డినంత క‌ల‌బంద‌ను గుజ్జును తీసుకుని దానిపై ప‌సుపును చ‌ల్లాలి. ఇలా ప‌సుపు చ‌ల్లిన క‌ల‌బంద గుజ్జును కాలిబొట‌న వేలు అడుగు భాగంలో ఉంచి ఊడిపోకుండా క‌ట్టుక‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల‌క‌ల‌క స‌మ‌స్య త‌గ్గుతుంది. కంటిపోటుతో బాధ‌ప‌డే వారు క‌ల‌బంద గుజ్జును వ‌స్త్రంలో వేసి ర‌సాన్ని పిండాలి. ఈ ర‌సాన్ని 2 చుక్క‌ల మోతాదులో రెండు చెవుల్లో వేయ‌డం వ‌ల్ల ఎంత‌టి తీవ్ర‌మైన కంటిపోటు అయినా స‌రే త‌గ్గిపోతుంది. ఈ విధంగా క‌ల‌బంద‌ను ఉప‌యోగించి మ‌నం కంటిచూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన చిట్కాల‌ను పాటించే ముందు వైద్యుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

Tags: aloe veraeye sight
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Pudina Sharbat : పుదీనా ష‌ర్బ‌త్‌.. తాగితే దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.