Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Ganji : గంజి తాగ‌డాన్ని అల‌వాటు చేసుకోండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

D by D
September 2, 2022
in ఆహారం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Ganji : మ‌నం ప్ర‌తి రోజూ అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అన్నం ఉడికిన త‌రువాత ఎక్కువ‌గా ఉన్న నీటిని వార్చుతారు. దీనినే గంజి లేదా అన్న ర‌సం అంటారు. గంజిని ఎక్కువ‌గా పూర్వ‌కాలంలో ఆహారంగా తీసుకునే వారు. ఉద‌యం పూట గంజి నీటిని అల్పాహారంగా తీసుకునే వారు. అలాగే అంబ‌లిని కూడా ఆహారంగా తీసుకునే వారు. ఇప్ప‌టికీ దీనిని ఆహారంగా తీసుకునే వారు ఉన్నారు. ప్ర‌స్తుత కాలంలో కుక్క‌ర్ ల పుణ్య‌మా అని అన్నాన్ని వార్చ‌డ‌మే మానేశారు. ఒకవేళ అన్నాన్ని వార్చి గంజిని తీసిన‌ప్ప‌టికీ దానిని ప‌డ‌బోస్తున్నారు.

కానీ గంజి నీటిలో కూడా పోష‌కాలు ఉంటాయ‌ని దీనిని తాగ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. గంజి నీటిలో శ‌రీరానికి కావ‌ల్సి అమైనో యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. అమైనో యాసిడ్లు గ్లూకోజ్ కంటే ఎక్కువ‌గా త్వ‌ర‌గా శ‌క్తిని ఇస్తాయి. గంజిని తాగ‌డం వ‌ల్ల కండ‌రాల‌కు మేలు క‌లుగుతుంది. ఒక గ్లాస్ గంజి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి తాగ‌డం వ‌ల్ల డ‌యేరియా స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
amazing health benefits of Ganji or rice soup
Ganji

జుట్టంత‌టికీ గంజి నీటిని ప‌ట్టించి అర గంట త‌రువాత త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల జుట్టు కాంతివంతంగా, ఒత్తుగా, బ‌లంగా మారుతుంది. గంజిని తాగ‌డం వ‌ల్ల క‌డుపులో మంట‌ను, అసిడిటీని త‌గ్గించుకోవ‌చ్చు. గంజిని వేడిగా, చ‌ల్లారిన త‌రువాత కూడా తీసుకోవ‌చ్చు. రాత్రి వండిన అన్నాన్ని వార్చిన గంజిలోనే వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మ‌రుసటి రోజూ ఉద‌యం త్వ‌ర‌గా ఈ అన్నాన్ని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల పైత్య వికారాలు, తాపం, ద‌ప్పిక‌, మూత్ర దోషాలు, అధిక వేడి త‌గ్గుతాయి.

నూలు వ‌స్త్రాల‌ను గ‌ట్టిగా మార్చ‌డానికి కూడా గంజిని ఉప‌యోగిస్తారు. నూలు వ‌స్త్రాల‌ను ఉతికి గంజి నీటిలో కొద్ది సేపు ఉంచి త‌రువాత ఎండ‌లో ఆర వేస్తారు. ఆరిన త‌రువాత ఈ వ‌స్త్రాల‌ను ఇస్త్రీ చేసుకోవ‌డం వ‌ల్ల నూలు వ‌స్త్రాలు చ‌క్క‌గా ఉంటాయి. గంజి పొడి మ‌న‌కు బ‌య‌ట దొరుకుతుండ‌డం వ‌ల్ల దీని వాడ‌కాన్ని పూర్తిగా త‌గ్గించారు. గంజిని ఇష్టంగా తాగే వారు కూడా ఉన్నారు. చైనాలో గంజిని రైస్ సూప్ గా పిలుస్తారు. దాదాపు ఆసియా దేశాల వారంద‌రూ గంజిని ఇష్టంగా తాగుతూ ఉంటారు. అందువల్ల మ‌నం కూడా గంజిని త‌ర‌చూ తాగుతుంటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags: Ganjirice soup
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Diseases : ఈ పొడిని రోజుకు ఒక్క స్పూన్ రాత్రి భోజ‌నానికి ముందు తినాలి.. స‌క‌ల రోగాలు న‌య‌మ‌వుతాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.