Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Amla Juice : ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకున్నారా..?

D by D
October 21, 2022
in మూలిక‌లు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Amla Juice : మ‌న ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే చెట్ల‌ల్లో ఉసిరి చెట్టు కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ఉసిరికాయ‌ను ఇంగ్లీష్ లో ఇండియ‌న్ గూస్ బెర్రీ అనీ, హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో ఆమ‌ల‌కా అని అంటారు. ఉసిరికాయ‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఉసిరి కాయ‌ల‌ను అలాగే ఉసిరి చెట్టు ఆకుల‌ను, పూల‌ను, గింజ‌ల‌ను, వేర్ల‌ను, బెర‌డును ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. ఉసిరికాయ‌లు ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఉసిరికాయ‌ల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. వైద్య‌ప‌రంగా ఉసిరికి అనేక ఔష‌ధ గుణాలు ఉన్నాయి. విట‌మిన్ సి, విట‌మిన్ ఇ పుష్క‌లంగా ఉన్న ఉసిరి జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది.

జుట్టు రాల‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది. షాంపుల త‌యారీలోనూ, త‌ల‌కు రాసే నూనెల త‌యారీలోనూ, జుట్టుకు వేసుకునే రంగుల త‌యారీలోనూ ఉసిరికాయ‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కానికి ఉసిరికాయ దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తుంది. ఉసిరికాయ నుండి తీసిన నూనెను వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. త‌ల‌నొప్పి, త‌ల‌భారాన్ని త‌గ్గించి మెద‌డుకు చ‌ల్ల‌ద‌నాన్ని అందించ‌డంలో ఉసిరి నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. తాజాగా జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఉసిరి జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజనాలను పొంద‌వ‌చ్చ‌ని , దీనిని క్ర‌మం త‌ప్ప‌కుండా తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని వెల్ల‌డైంది. ఉసిరికాయ‌ను తిన‌డం వ‌ల్ల దేహానికి శ‌క్తి ల‌భిస్తుంద‌ని, దాహంగా ఉన్న‌ప్పుడు ఉసిరికాయ‌ను నోట్లో వేసుకుని చ‌ప్పరిస్తూ ఉంటే దాహం తీరుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
take Amla Juice daily for these wonderful health benefits
Amla Juice

మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు రోజూ ఉసిరికాయ‌ను తీసుకుంటే ఇంజెక్ష‌న్ వేసుకునే అవ‌స‌రం ఉండ‌దని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ఉసిరికాయ జ్యూస్ లో ప‌టిక బెల్లం క‌లిపి తీసుకుంటే క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి త‌గ్గుతుంద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరికాయ‌ల‌తో చేసిన ఆమ్లా ముర‌బ్బ తింటే వాంతుల నుండి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది. ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌ల‌కు ఉసిరిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఉసిరికాయ‌తో చేసిన మాత్ర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వాత‌, క‌ఫ‌, పిత రోగాలు మ‌న దరి చేర‌కుండా ఉంటాయి. ఉసిరికాయ‌ల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్న పొంద‌వ‌చ్చు అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు.

ఉప్పులో ఎండ‌బెట్టిన ఉసిరిని నిల్వ చేసుకుని దానిని ప్ర‌తిరోజూ ఒక ముక్క బుగ్గ‌న పెట్టుకుని చ‌ప్ప‌రిస్తూ ఉంటే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎసిడిటి, అల్స‌ర్ వంటి వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి. అందుకే ప్ర‌తి ఇంట్లో ఒక ఉసిరి చెట్టును త‌ప్ప‌నిస‌రిగా పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. భార‌తీయ వాస్తూ శాస్త్రంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఇంటి పెర‌ట్లో కనుక ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటి వాస్తూ దోషాలు ఏవి ఉన్నా కూడా తొల‌గిపోతాయ‌ని వాస్తూ శాస్త్రం చెబుతుంది. ఉసిరికాయ ఉప్పు రుచిని త‌ప్ప మిగిలిన ఐదు రుచుల‌ను క‌లిగి ఉంటుంది.

నారింజ‌లో కంటే ఉసిరిలో ప‌ది రెట్లు విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవ‌నాయిడ్స్, కెరోటినాయిడ్స్, గ్లూకోజ్, క్యాల్షియం వంటివి కూడా ఉసిరిలో అధికంగా ల‌భ్య‌మ‌వుతాయి. ఉసిరిని క్ర‌మం త‌ప్ప‌కుండా వివిధ ర‌కాలుగా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: amla juice
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Coriander Tomato Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే.. 10 నిమిషాల్లో ఇలా కొత్తిమీర ట‌మాటా రైస్ చేయండి..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.