Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఆరోగ్యంగా ఉండేందుకు ప‌ళ్ల ర‌సం లేదా పండ్లు.. రెండింటిలో ఏవి తీసుకుంటే మంచిది ?

Admin by Admin
July 25, 2021
in ఆరోగ్యం, ప్ర‌శ్న - స‌మాధానం
0
Share on FacebookShare on Twitter

సాధారణంగా వ్యాయామం చేసిన తర్వాత ఎవ‌రైనా స‌రే అలసిపోతారు. అటువంటి పరిస్థితిలో వారు శక్తిని పొందేందుకు ప‌ళ్ల రసం తాగడానికి ఇష్టపడతారు. ప‌ళ్ల‌ రసం తాగడం వల్ల శక్తి ల‌భిస్తుంది. తాజాద‌నం అందుతుంది. దీంతో చాలా మంది ప‌ళ్ల ర‌సాల‌ను చాలా ఆరోగ్యకరమైనవిగా, ప్రయోజనకరమైనవిగా భావిస్తారు. ప‌ళ్ల రసం, పండ్ల‌లో నిజానికి ఏవి తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

fruits or fruit juices which one is better for health

You might also like

డ‌యాబెటిస్ ఉన్నవారు రోజుకు అస‌లు ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

July 7, 2025

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025

1. పండ్ల రసాలలో చక్కెర, కేలరీలు ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. కాబట్టి అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ప‌ళ్ల ర‌సం ప‌నికిరాదు. అందుకు బ‌దులుగా వారు కూర‌గాయ‌ల జ్యూస్‌ను తాగాలి. బ‌రువు పెరాగ‌ల‌నుకునే వారు ప‌ళ్ల ర‌సాల‌ను తాగాలి. ప‌ళ్ల ర‌సాల‌ను తాగ‌డం వ‌ల్ల వాటితో క్యాలరీలు అధికంగా వ‌స్తాయి. దీంతో బ‌రువు పెరుగుతారు. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ప‌ళ్ల ర‌సాల‌కు బ‌దులుగా కూర‌గాయ‌ల ర‌సాల‌ను తాగితే మంచిది.

2. ప‌ళ్ల ర‌సాల‌లో ఫైబ‌ర్ త‌క్కువ‌గా ఉంటుంది. పండ్లతో పోలిస్తే ర‌సాల్లో ఫైబ‌ర్ శాతం త‌గ్గుతుంది. అందువ‌ల్ల ర‌సాలు జీర్ణ వ్య‌వ‌స్థ‌కు పెద్ద‌గా ప‌నికిరావు. జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబ‌ర్ కావాలి. అందుకు గాను పండ్ల‌నే తినాలి, కానీ ప‌ళ్ల ర‌సాల‌ను తాగ‌రాదు.

3. ప‌ళ్ల ర‌సాల‌ను తాగ‌డం వ‌ల్ల కొన్ని ర‌కాల మెడిసిన్ల‌పై నేరుగా ప్ర‌భావం ప‌డుతుంది. క‌నుక మీకు రెగ్యుల‌ర్‌గా ప‌ళ్ల ర‌సాల‌ను తాగే అల‌వాటు ఉంటే, మీరు ఏవైనా మందుల‌ను వాడుతుంటే దుష్ప్ర‌భావాలు క‌లిగే అవ‌కాశం ఉంది. క‌నుక ప‌ళ్ల ర‌సాల‌ను తాగ‌రాదు. ఈ విష‌యంలో అవ‌స‌రం అయితే వైద్యుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

4. పళ్ల ర‌సాల్లో ఫైబ‌ర్ త‌క్కువగా, చ‌క్కెర‌లు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. 2019లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, పండ్ల రసం తాగేవారు లేదా తీపి పానీయాలు తీసుకునేవారు టైప్ 2 డయాబెటిస్ బారిన ప‌డే అవ‌కాశాలు 16 శాతం ఎక్కువ‌గా ఉంటాయ‌ని వెల్ల‌డైంది. అందువ‌ల్ల ప‌ళ్ల ర‌సాల‌ను తాగ‌రాదు. మీకు టైప్ 2 డయాబెటిస్ ఉంటే రసం తాగడానికి బదులుగా పండ్ల‌ను తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పండ్లలో ఉండే ఫైబర్ మీ శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు. అంతేకాకుండా ఆ ఫైబ‌ర్ షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది. క‌నుక టైప్ 2 డయాబెటిస్ ఉన్న‌వారు ప‌ళ్ల ర‌సాల‌కు బ‌దులుగా పండ్ల‌ను తీసుకుంటే మంచిది. మేలు జ‌రుగుతుంది.

5. పండ్లు, కూర‌గాయ‌ల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని త‌గ్గిస్తుంది. అందుక‌నే తాజా పండ్లు, కూర‌గాయ‌ల‌ను తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే ప‌ళ్ల ర‌సాల్లో పొటాషియం పండ్ల క‌న్నా ఎక్కువ‌గా ఉంటుంది. అంత ఎక్కువ మొత్తంలో పొటాషియం మ‌న శ‌రీరానికి మంచిది కాదు. క‌నుక ప‌ళ్ల ర‌సాల‌ను తాగ‌కూడ‌దు. లేదంటే కిడ్నీల‌పై భారం పెరుగుతుంది. కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. కాబ‌ట్టి ఎటు చూసినా ప‌ళ్ల ర‌సాలు మంచివి కావ‌ని తెలుస్తుంది. క‌నుక నేరుగా పండ్ల‌నే తింటే మంచిది. అయితే జిమ్ చేసేవారు, బ‌రువు పెర‌గ‌ద‌లుచుకున్న వారు, శ‌క్తి ఎక్కువ‌గా కావ‌ల్సిన వారు ప‌ళ్ల ర‌సాల‌ను తాగ‌వ‌చ్చు. మిగిలిన వారు ప‌ళ్ల ర‌సాల‌ను కాకుండా పండ్ల‌ను తీసుకుంటే మంచిది.

Tags: fruit juicesfruitsపండ్ల ర‌సాలుపండ్లు
Admin

Admin

Related Stories

డ‌యాబెటిస్ ఉన్నవారు రోజుకు అస‌లు ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

by Admin
July 7, 2025
0

డయాబెటిస్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.. మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం ఉంటుంది.. ముఖ్యంగా ఈ వ్యాధికి ప్రధాన కారణం.. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం అని...

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

by Admin
July 5, 2025
0

నా వయసు 65 ఏళ్లు. గత నాలుగేళ్లుగా డయాబెటిస్ వ్యాధికి మందులు వాడుతున్నాను. రక్తంలోని చక్కెర ప్రమాణాలు దాదాపు సక్రమంగానే ఉన్నాయిగాని, నరాల బలహీనత, శృంగార సమస్యల...

ప‌సుపు క‌లిపిన పాల‌ను గ‌ర్భిణీలు తాగ‌వ‌చ్చా..?

by Admin
June 9, 2025
0

గర్భిణీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. చాలా మంది గర్భిణీలు చేసే తప్పేంటంటే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని నచ్చిన ఆహార పదార్థాలను తీసుకుంటూ...

భోజ‌నం చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో నీళ్ల‌ను తాగ‌కూడదా..? ఎందుకు..?

by Admin
June 2, 2025
0

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళ‌కు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ చాలా మంది స‌రైన స‌మ‌యానికి...

Next Post

వారానికి ఒక‌సారి నువ్వుల నూనెతో శ‌రీరాన్ని మసాజ్ చేసుకోవాలి.. ఎందుకో తెలుసా ?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.