Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

భోజ‌నం చేసిన వెంట‌నే తీపి ప‌దార్థాల‌ను తినాల‌ని ఎందుకు అనిపిస్తుందో తెలుసా ?

Admin by Admin
August 6, 2021
in ఆరోగ్యం, ప్ర‌శ్న - స‌మాధానం
0
Share on FacebookShare on Twitter

సాధార‌ణంగా చాలా మంది భోజ‌నం చేసిన వెంట‌నే తీపి ప‌దార్థాల‌ను తింటుంటారు. కొంద‌రు సోంపు గింజ‌లు లేదా పండ్ల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తారు. అయితే ఇవి తింటే ఫ‌ర్వాలేదు, కానీ భోజనం చేశాక తీపి ప‌దార్థాల‌ను తింటేనే ప్ర‌మాదం. అస‌లు భోజ‌నం చేశాక ఎవ‌రికైనా సరే తీపి ప‌దార్థాల‌ను తినాల‌ని ఎందుకు అనిపిస్తుంది ? దీని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

why we crave for sweets after taking meals

You might also like

డ‌యాబెటిస్ ఉన్నవారు రోజుకు అస‌లు ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

July 7, 2025

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025

సాధార‌ణంగా భార‌తీయ ఆహార విధానంలో కార్బొహైడ్రేట్లు (పిండి ప‌దార్థాలు) ఒక భాగం. ఇవి ఉండే ఆహారాల‌నే మ‌నం ఎక్కువగా తింటుంటాం. ఉత్త‌రాది వారు గోధుమల‌తో త‌యారు చేసే రొట్టెలు తిన్నా.. ద‌క్షిణాది వారు అన్నం తిన్నా.. ఈ రెండింటిలోనూ కార్బొహైడ్రేట్లు ప్ర‌ధాన‌మైన‌వి. అయితే వీటితోపాటు మనం తినే కొన్ని ఆహారాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. మ‌నం తినే పిండి ప‌దార్థాల వ‌ల్ల మ‌న శ‌రీరం కొన్ని ఆహారాల్లో ఉండే ఆ ట్రిప్టోఫాన్‌ను శోషించుకుంటుంది. ఇక ట్రిప్టోఫాన్ మ‌న శ‌రీరంలో సెర‌టోనిన్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇదొక న్యూరో ట్రాన్స్‌మిట‌ర్‌. మూడ్‌ను మారుస్తుంది.

సెర‌టోనిన్‌ను ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. ఇది ఉత్ప‌త్తి అవ‌డం వ‌ల్ల మ‌నం ప్ర‌శాంతంగా మారిపోతాం. సంతృప్తి చెందుతాం. ఆ స్థితిలో తీపి తినాల‌ని శ‌రీరం స‌హ‌జంగానే ఉవ్విళ్లూరుతుంది. దీంతో తీపి తినాల‌నిపిస్తుంది. ఆ ప‌దార్థాల‌ను తింటారు. ఇక ఇదే క్ర‌మంగా అల‌వాటు అవుతుంది. దాన్నుంచి బ‌య‌ట ప‌డ‌లేరు. భోజ‌నం చేశాక క‌చ్చితంగా తీపి ప‌దార్థాల‌ను తింటారు.

అయితే కొంద‌రిలో మాత్రం ఇలా కాదు. వారు భోజ‌నం చేశాక తీపి తినాల‌నే నియమం పెట్టుకుంటారు. దీంతో వారికి అది అల‌వాటు అవుతుంది. దాన్ని వారు మాన‌లేరు. ఇలా చాలా మంది ఈ రెండు ర‌కాల కార‌ణాల వ‌ల్ల భోజ‌నం చేశాక తీపి ప‌దార్థాల‌ను తింటుంటారు.

కానీ నిజానికి భోజ‌నం అనంత‌రం శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా పెరుగుతాయి క‌నుక ఆ స్థితిలో తీపి తిన‌రాదు. తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ ఇంకా ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక భోజ‌నం చేసిన వెంట‌నే తీపి తిన‌రాదు. పైన తెలిపిన‌ట్లుగా సోంపు గింజ‌లు లేదా పండ్ల‌ను తింటే మంచిది. లేదా హెర్బ‌ల్ టీల‌ను తాగ‌వ‌చ్చు.

భోజ‌నం అనంత‌రం తీపి తినాల‌నే యావ త‌గ్గాలంటే భోజ‌నంలో ఎక్కువ‌గా కూర‌గాయ‌లు ఉండేలా చూసుకోవాలి. పిండి ప‌దార్థాల‌ను త‌క్కువ‌గా తినాలి. భోజ‌నానికి ముందు కీర‌దోస‌, ట‌మాటా, క్యారెట్‌, బీట్‌రూట్ వంటి వాటిని ముక్క‌లుగా కోసి స‌లాడ్ రూపంలో తినాలి. దీంతో భోజ‌నం చేశాక క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. తీపి తినేందుకు ఇష్ట ప‌డ‌రు. ఇలా భోజనం చేశాక తీపి తినాల‌నే అల‌వాటును సుల‌భంగా మానుకోవ‌చ్చు.

Tags: mealssugar cravingssweetsతీపితీపి ప‌దార్థాలుభోజ‌నంస్వీట్లు
Admin

Admin

Related Stories

డ‌యాబెటిస్ ఉన్నవారు రోజుకు అస‌లు ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

by Admin
July 7, 2025
0

డయాబెటిస్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.. మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం ఉంటుంది.. ముఖ్యంగా ఈ వ్యాధికి ప్రధాన కారణం.. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం అని...

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

by Admin
July 5, 2025
0

నా వయసు 65 ఏళ్లు. గత నాలుగేళ్లుగా డయాబెటిస్ వ్యాధికి మందులు వాడుతున్నాను. రక్తంలోని చక్కెర ప్రమాణాలు దాదాపు సక్రమంగానే ఉన్నాయిగాని, నరాల బలహీనత, శృంగార సమస్యల...

ప‌సుపు క‌లిపిన పాల‌ను గ‌ర్భిణీలు తాగ‌వ‌చ్చా..?

by Admin
June 9, 2025
0

గర్భిణీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. చాలా మంది గర్భిణీలు చేసే తప్పేంటంటే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని నచ్చిన ఆహార పదార్థాలను తీసుకుంటూ...

భోజ‌నం చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో నీళ్ల‌ను తాగ‌కూడదా..? ఎందుకు..?

by Admin
June 2, 2025
0

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళ‌కు నిద్రించ‌డం ఎంత అవ‌స‌ర‌మో స‌రైన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ చాలా మంది స‌రైన స‌మ‌యానికి...

Next Post

అరికెలు.. పోష‌కాలు ఘ‌నం.. ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.