ఈ సీజన్‌లో వేడిని తరిమికొట్టండి.. ఈ ఆహారాలను తీసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది..!
వేసవి వచ్చిందంటే చాలు చాలా వేడిగా ఉంటుంది. శరీరం వేడిగా మారుతుంది. దీంతో అందరూ శరీరాన్ని చల్లబరుచుకునేందుకు యత్నిస్తుంటారు. అందుకుగాను నీటిని తాగడం, చల్లని పదార్థాలను తినడం చేస్తుంటారు. అయితే కాలానుగుణమైన పండ్లు, కూరగాయలతోపాటు ఇతర పదార్థాలను తినడం ద్వారా కూడా వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. వేడి తగ్గుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. వేసవిలో పుచ్చకాయ మనకు ఎక్కువగా లభిస్తుంది. ఇది చాలా రుచికరంగా ఉండడమే కాదు, తాజాదనాన్ని అందిస్తుంది. ఇందులో…