అప్పట్లో సినిమాలను ఇలాంటి టాకీస్‌లలోనే ప్రదర్శించే వాళ్లు తెలుసా..?
ఇవాళంటే సినిమా హాళ్ళలో ఏసీ, కుషన్ సీట్లు, రకరకాల సౌకర్యాలు ఉన్నాయి. 35 సంవత్సరాల ముందు టూరింగ్ టాకీస్ లు ఉండేవి. వాటిని చూస్తే, మాకు అనిర్వచనీయమైన ఆనందం. ఎందుకంటే ఎన్నో సినిమాలు వాటిల్లో చూస్తూ పెరిగాం. ఏ సౌకర్యాలు లేకపోయినా అందులోనే ఆనందం వెతుక్కున్నాం. పెద్ద రేకుల షెడ్డు. ముందు వెనుక గోడలు. ముందు గోడలోనే ప్రొజెక్టర్, టికెట్ల బుకింగ్. వెనుక గోడకు వెల్లవేసేవారు. అదే మా ముద్దుల వెండితెర. మా ఊరికి దగ్గరలో ఆరవల్లిలో…