ముఖంపై ట్యాన్ పెరిగి నల్లగా మారింది.. ఈ చిట్కాను పాటిస్తే చాలు..
కొంత మంది చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీంతో ఎండలో కాసేపు తిరిగితే చాలు, వెంటనే ముఖం నల్లగా మారిపోతుంది. అలాగే కాలుష్యం, ఇతర కారణాల వల్ల కూడా ముఖంపై నలుపు దనం పెరిగిపోతుంది. దీన్నే ట్యానింగ్ అని కూడా అంటారు. కానీ దీనికి ఇంట్లో దొరికే పెసరపిండితోనే పరిష్కారం ప్రయత్నించొచ్చు. ముఖంపై పేరుకున్న నలుపుదనం పోవాలంటే మూడు చెంచాల పెసరపిండి తీసుకోవాలి. దీనిలో అరకప్పు గులాబీ నీరు, మూడు చెంచాల రోజ్ ఆయిల్, చెంచా పంచదార…