శుక్రవారం ఈ పనులు చేస్తే, నిత్య దరిద్రులు అవుతారు!
శుక్రవారం లక్ష్మీదేవి సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది. ఈరోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. అదే సమయంలో శుక్రవారం అస్సలు చేయకూడని కొన్ని పనుల గురించి కూడా తెలుసుకోవాలంటారు. అవేంటంటే, శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు. అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫోటోలు కానీ దేవుడి మందిరంలో నుంచి బయటకు తీయరాదు. కొంతమంది పాతవి లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ…