తన తల్లి తలనే నరికిన పరశురాముడు.. ఆయన అలా ఎందుకు చేశాడంటే..?
ఋచీథకుని కుమారుడైన జమదగ్ని, ప్రసేనజిత్తు కుమార్తె అయిన రేణుకను వివాహం చేసుకున్నాడు. వీరికి రమణ్వతుడు, సుసేషణుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు జన్మించారు. జమదగ్ని గొప్ప తపస్సంపన్నుడు మాత్రమేగాదు, గొప్ప ధనుర్విద్యావేత్త కూడా. జమదగ్ని బాణాలు సంధించి వదులుతూంటే, వాటిని ఏరి తెచ్చి భర్తకు ఇచ్చేది రేణుక. ఇది వారి నిత్యక్రీడ. ఒకసారి జమదగ్ని విడిచిన బాణం తీసుకురావడానికి వెళ్ళిన రేణుక ఆలస్యంగా భర్త దగ్గరకు వచ్చింది. కాలయాపనకు కారణం అడిగాడు జమదగ్ని. సూర్యతాపానికి కాళ్ళు కాలిపోతూంటే భరించలేక…