Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఈ 6 మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

Admin by Admin
March 13, 2021
in Featured
0
Share on FacebookShare on Twitter

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా గాలి కాలుష్యం అనేది పెరిగిపోయింది. ఒక‌ప్పుడు కేవ‌లం న‌గరాల్లో మాత్ర‌మే కాలుష్య‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం ఉండేది. కానీ ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణాల్లోనూ కాలుష్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతోంది. దీంతో ప్ర‌జ‌లు అనేక అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డుతున్నారు. పీల్చేందుకు స్వ‌చ్ఛ‌మైన గాలి కూడా ల‌భించ‌ని ప‌రిస్థితి నెలకొంటోంది. అయితే బయ‌ట ఎలాగూ కాలుష్యంతో నిండిన గాలిని పీలుస్తున్నాం. కానీ ఇంట్లో స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన మొక్క‌ల‌ను ఇండ్ల‌లో పెంచుకోవాలి. అవి గాలిలో ఉండే కాలుష్య కార‌కాల‌ను త‌గ్గిస్తాయి. గాలిని శుభ్రం చేసి స్వ‌చ్ఛ‌మైన గాలిని మ‌న‌కు అందిస్తాయి. మ‌రి ఆ మొక్క‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. బోస్ట‌న్ ఫెర్న్ (Boston Fern)

6 plants that clean air in your home

You might also like

Vegan Diet : పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది.. ఇలా తింటే మ‌న‌కు ఎలాంటి రోగాలు రావు..!

April 24, 2022

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగేది ఇందుకే.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన సీక్రెట్‌..!

March 29, 2022

ఈ మొక్క ఇంట్లో గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి కాలుష్య కార‌కాల‌ను నిర్మూలిస్తుంది. అలాగే బెంజీన్‌, జైలీన్ వంటి స‌మ్మేళనాల‌ను గాలి నుంచి తొల‌గించి గాలిని శుభ్రంగా మారుస్తుంది. వీటికి వారంలో ఒక‌సారి నీటిని పోస్తే చాలు. దీన్ని ఇంటి లోప‌ల పెంచుకోవ‌చ్చు.

2. స్పైడ‌ర్ ప్లాంట్ (Spider Plant)

6 plants that clean air in your home

ఇవి కూడా గాలిలోని కాలుష్య కార‌కాల‌ను నిర్మూలిస్తాయి. వీటిని ఇండ్ల‌లో పెంచుకోవ‌చ్చు. సంర‌క్ష‌ణ గురించి పెద్దగా ప‌ట్టించుకోవాల్సిన పనిలేదు. కిటికీల్లో ఎండ త‌గిలే చోట పెడితే చాలు. అవే సుల‌భంగా జీవిస్తాయి.

3. వీపింగ్ ఫిగ్ (Weeping Fig)

6 plants that clean air in your home

ఈ మొక్క‌లను సంర‌క్షించాలే గానీ 2 ఫీట్ల నుంచి 10 ఫీట్ల వ‌ర‌కు పెర‌గ‌గ‌ల‌వు. వీటి నిర్వ‌హ‌ణ‌కు కూడా పెద్ద‌గా స‌మ‌యం కేటాయించాల్సిన ప‌నిలేదు. వీటిని ఇంట్లో, ఇంటి బ‌య‌ట కూడా పెంచుకోవ‌చ్చు. కానీ సూర్య ర‌శ్మి త‌గిలేలా ఉంచాలి. ఒక్క‌సారి నీటిని పోశాక నీరు పూర్తిగా త‌డి ఆరిపోయే వ‌ర‌కు వేచి ఉండి అప్పుడు మ‌ళ్లీ నీటిని పోయ‌వ‌చ్చు. అందువ‌ల్ల ఈ మొక్క‌ల‌ను సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. ఇక ఇవి కూడా ఇంట్లోని గాలిని శుభ్రం చేసేందుకు స‌హాయ ప‌డతాయి.

4. పీస్ లిల్లీ (Peace Lily)

6 plants that clean air in your home

ఇది కేవ‌లం ఇంట్లోని గాలిని శుభ్రం చేయ‌డం మాత్ర‌మే కాదు, అంద‌మైన పూల‌ను కూడా పూస్తుంది. అవి సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతాయి. ఇంట్లో పెట్టుకుంటే ప‌రిస‌రాలు అందంగా క‌నిపిస్తాయి. ఈ మొక్క‌లు కూడా గాలిలో ఉండే కాలుష్య కార‌కాలు, ఆర్గానిక్ సమ్మేళ‌నాల‌ను తొల‌గిస్తాయి. గాలిని శుభ్రం చేస్తాయి. వీటి నిర్వ‌హ‌ణ కూడా చాలా సుల‌భ‌మే. అయితే ఈ మొక్కలు చిన్నారుల‌కు ప్ర‌మాద‌క‌రం. క‌నుక చిన్నారులు ఉన్న ఇండ్ల‌లో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

5. ఇంగ్లిష్ ఐవీ (English Ivy)

6 plants that clean air in your home

ఇంట్లోని గాలిలో ఉండే కాలుష్య కార‌కాల‌ను తొల‌గించ‌డంలో ఈ మొక్క కూడా అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్ని ఇంట్లో అలంక‌ర‌ణ కోసం కూడా పెంచుకోవ‌చ్చు. అయితే సూర్య‌ర‌శ్మి త‌గిలే చోట ఉంచాలి. ఎప్పుడో ఒక‌సారి నీటిని పోసినా చాలు, సుల‌భంగా ఈ మొక్క పెరుగుతుంది. గాలిని శుభ్ర ప‌రుస్తుంది.

6. అలోవెరా (Aloe Vera)

6 plants that clean air in your home

ఈ మొక్క గురించి దాదాపుగా అంద‌రికీ తెలుసు. క‌ల‌బంద మొక్క ఆకుల నుంచి తీసిన గుజ్జును అనేక స‌మ‌స్య‌ల‌కు, ఔష‌ధాల త‌యారీలో ఉపయోగిస్తారు. అయితే ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే గాలిని శుభ్రం చేస్తుంది. గాలిలో ఉండే అనేక స‌మ్మేళ‌నాల‌ను నిర్మూలిస్తుంది. ఇండ్ల‌లో పెంచుకునే మొక్క‌ల్లో ఇది కూడా ఒక‌టి.

Tags: air cleaningair cleaning plantsair pollutionfresh airplantspollutants removalpollutionకాలుష్యంకాలుష్య కారకాల‌ను తొల‌గించ‌డంగాలి కాలుష్యంగాలిని శుభ్రం చేయ‌డంగాలిని శుభ్రం చేసే మొక్క‌లుతాజా గాలిమొక్క‌లుస్వ‌చ్ఛ‌మైన గాలి
Admin

Admin

Related Stories

Vegan Diet : పూర్వ‌కాలంలో రుషులు తిన్న ఆహారం ఇది.. ఇలా తింటే మ‌న‌కు ఎలాంటి రోగాలు రావు..!

by D
April 24, 2022
0

Vegan Diet : సూర్యుడి చేత వండ‌బడిన ప‌చ్చి ఆహారం మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం తినే ఆహారంలో 70 శాతం...

Diabetes : షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగేది ఇందుకే.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన సీక్రెట్‌..!

by D
March 29, 2022
0

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌యాబెటిస్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. చిన్న వ‌య‌స్సులోనే ఈ వ్యాధి బారిన ప‌డుతున్న‌ వారు ఎక్కువ‌వుతున్నారు. ఈ...

Finger : కాలి బొట‌న‌వేలి క‌న్నా చూపుడు వేలు పొడ‌వుగా ఉంటే మ‌హిళ‌లు త‌మ భ‌ర్త‌ల‌ను ఆటాడిస్తారా ?

by Admin
March 18, 2022
0

Finger : మ‌న శ‌రీరంలో అన్ని భాగాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. మ‌నిషికి మనిషికీ ఇవి ఆకారం, రంగులో మార్పుల‌ను క‌లిగి ఉంటాయి. కానీ అంద‌రికీ...

Chanakya Tips : ఆఫీస్ రాజ‌కీయాల్లో బ‌లి కాకుండా ఉండాలంటే.. ఉద్యోగులు ఈ చాణ‌క్య సూత్రాల‌ను పాటించాలి..!

by Admin
March 4, 2022
0

Chanakya Tips : ఉద్యోగాలు చేసేవారు ఎవ‌రైనా సరే.. చాలా సంద‌ర్భాల్లో ఆఫీసుల్లో జ‌రిగే రాజ‌కీయాల‌కు బ‌ల‌వుతుంటారు. తోటి ఉద్యోగులు చేసే కుటిల ప్ర‌య‌త్నాల‌కు ఉద్యోగాల‌ను కోల్పోయే...

Next Post

కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కనిపించే 10 లక్షణాలు ఇవే..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.