Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Lungs : వీటిని రోజూ తింటే.. మీ ఊపిరితిత్తులు శుభ్ర‌మ‌వుతాయి..!

Editor by Editor
September 21, 2022
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Lungs : మ‌న శ‌రీరంలో ఉన్న అవ‌యవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఇవి మ‌నం పీల్చే గాలిని శుద్ధి చేసి శ‌రీరానికి అందిస్తాయి. అలాగే మ‌న లోప‌ల ఉండే హానికార‌క వాయువుల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప్ర‌స్తుతం మ‌నం పాటిస్తున్న జీవ‌న‌శైలితోపాటు ఉంటున్న కాలుష్య వాతావ‌ర‌ణం వ‌ల్ల మ‌న ఊపిరితిత్తులు త్వ‌ర‌గా చెడిపోతున్నాయి. దీంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే ఇలా ఊపిరితిత్తులు చెడిపోకుండా ఉండాలంటే.. అందుకు కొన్ని ఆహారాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. ఇక ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

take these foods daily to clean Lungs
Lungs

దానిమ్మ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలో కణాల‌ను ర‌క్షిస్తాయి. అందువ‌ల్ల వైర‌స్‌ల బారి నుంచి క‌ణాల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే క‌ణతులు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. దీంతోపాటు శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. నిత్యం దానిమ్మ గింజ‌ల‌ను తిన‌డం లేదా దానిమ్మ ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఉల్లిపాయ‌ల్లో ఉండే స‌ల్ఫ‌ర్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అందువ‌ల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. నిత్యం ఉల్లిపాయ‌ల‌ను తినాల‌ని వారు సూచిస్తున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

యాపిల్ పండ్ల‌లో ఫ్లేవనాయిడ్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు విటమిన్ బి, సి, ఇ లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. క‌నుక రోజుకు ఒక యాపిల్ ను తిన్నా ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. ద్రాక్ష పండ్ల‌లో నరింగిన్ అన‌బ‌డే ఫ్లేవ‌నాయిడ్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. క‌నుక ద్రాక్ష‌ల‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే నారింజ పండ్ల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో మ‌న శ‌రీరంలో చేరే వైర‌స్‌లు, బాక్టీరియాలు న‌శిస్తాయి. ఈ క్ర‌మంలో లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి.

క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ, సిలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి. బీన్స్‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. వీటిల్లో ఉండే మెగ్నిషియం ఊపిరితిత్తుల‌కు మేలు చేకూరుస్తుంది. బాదం, పిస్తా ప‌ప్పులు, వాల్‌న‌ట్స్‌, హేజ‌ల్ న‌ట్స్‌.. త‌దిత‌ర న‌ట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. ప‌సుపులో క‌ర్‌క్యుమిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల‌ను ర‌క్షిస్తుంది. వైర‌స్‌ల‌ను నాశ‌నం చేస్తుంది. నిత్యం పాల‌ల్లో ప‌సుపును క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. క‌నుక ఈ ప‌దార్థాల‌ను రోజూ తీసుకుంటే ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. దీంతో శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Tags: lungs
Editor

Editor

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Rasam : ఈ ర‌సాన్ని రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నంతో తీసుకోండి.. రోగ నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.