Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

రోజూ ప‌సుపు తీసుకుంటే మీ శ‌రీరంలో జ‌రిగే అద్భుతాలు ఇవే..!

D by D
September 1, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో త‌ప్ప‌కుండా ఉండే ప‌దార్థాల్లో ప‌సుపు కూడా ఒక‌టి. ప‌సుపు వాడ‌ని వంట‌గ‌ది ఉండ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఎంత కొంత మోతాదులో ప‌సుపును వేస్తూ ఉంటాము. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వాపులు, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు త‌ర‌చూ ప‌సుపును తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే ప‌సుపును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ ల నుండి మ‌న‌ల్ని కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ప‌సుపులో క‌ర్క్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడిక‌ల్స్ ను న‌శింప‌జేసి శ‌రీర అవ‌య‌వాలు దెబ్బ‌తినకుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ప‌సుపు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెంచ‌డంలో, గుండె జ‌బ్బుల బారిన‌ప‌డ‌కుండా చేయ‌డంలో ప‌సుపు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
this is what happens when you take turmeric everyday
turmeric

అలాగే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగేలా చేయ‌డంలో, ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌కుండా చేయ‌కుండా కూడా ప‌సుపు దోహ‌ద‌ప‌డుతుంది. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌య్యి అందులో ఉండే పోష‌కాలు శ‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి. అలాగే ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. అలాగే ప‌సుపును వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవక్రియ‌ల రేటు పెరుగుతుంది. దీంతో మ‌నం సుల‌భంగా బ‌రువు తగ్గ‌వ‌చ్చు. అంతేకాకుండా ప‌సుపును వాడ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో మ‌నం జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోకుండా ఉంటాము. అదే విధంగా ప‌సుపును వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

ఫ్రీరాడికల్స్ కార‌ణంగా చ‌ర్మ ఆరోగ్యం దెబ్బ‌తినకుండా చేయ‌డంలో, యువి కిర‌ణాల నుండి చ‌ర్మాన్ని కాపాడ‌డంలో ప‌సుపు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాకుండా ప‌సుపును వాడ‌డం వ‌ల్ల కాలేయంలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ వేగవంతంగా జ‌రుగుతుంది. దీంతో శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు, మ‌లినాలు తొల‌గిపోయి శ‌రీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ప‌సుపును వాడ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ విధంగా ప‌సుపు మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: turmeric
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Ragi Cookies : ఓవెన్ లేకున్నా రాగి పిండితో ఇలా ఎంతో రుచిక‌ర‌మైన కుక్కీస్‌ను చేసుకోవ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.