Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

శ‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ?

Admin by Admin
July 20, 2021
in వైద్య విజ్ఞానం
0
Share on FacebookShare on Twitter

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఎల్‌డీఎల్ మ‌న శ‌రీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువ‌గా ఉండ‌డం హానిక‌రం. ఎల్‌డీఎల్‌ను త‌గ్గించేందుకు హెచ్‌డీఎల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

how much time it will take to reduce cholesterol levels in body

You might also like

గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో తెలుసా..?

July 28, 2025

డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ లో అర్ధం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా.? 3 కారణాలు ఇవే.!

July 25, 2025

ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. హైబీపీ వ‌స్తుంది. డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి.

కొలెస్ట్రాల్ అనేది ఒక ఫ్యాట్ లాంటి ప‌దార్థం. దీన్ని మ‌న శ‌రీరంలో లివ‌ర్ ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో ప‌లు విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అయితే ఎల్‌డీఎల్ అంటే.. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ర‌క్త నాళాల్లో అది పేరుకుపోయి గుండె పోటు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల దాన్ని త‌గ్గించుకోవాలి.

మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ 100 mg/dL క‌న్నా త‌క్కువ‌గా ఉండాలి. 130 నుంచి 159 mg/dL మ‌ధ్య ఎల్‌డీఎల్ ఉంటే దాన్ని బార్డ‌ర్ లైన్ అంటారు. అదే 160 mg/dL క‌న్నా ఎక్కువ‌గా ఎల్‌డీఎల్ ఉంటే అది హానిక‌రంగా చెబుతారు.

అయితే ఎల్‌డీఎల్ స్థాయిల‌ను బ‌ట్టి అది త‌గ్గేందుకు ప‌ట్టే స‌మ‌యం మారుతుంది. ఎల్‌డీఎల్ కొందరిలో 600 mg/dL వ‌ర‌కు ఉంటుంది. అలాంటి వారు డాక్ట‌ర్ సూచించిన‌ట్లుగా మందుల‌ను వాడితే నెల రోజుల్లోగా కొలెస్ట్రాల్ అదుపులోకి వ‌స్తుంది. లేదంటే 3 నుంచి 6 నెల‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. అయితే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకునేందుకు వ్యాయామం చేయ‌డంతోపాటు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి.

ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌తోపాటు కూర‌గాయ‌లు, పండ్లు, న‌ట్స్, చేప‌ల‌ను అధికంగా తీసుకోవాలి. దీంతో ఎల్‌డీఎల్ త‌గ్గుతుంది. అలాగే రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా స‌రే వ్యాయామం చేయాలి. ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, కొవ్వు ప‌దార్థాలు, జంక్ ఫుడ్‌, వేపుళ్లు, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాల‌ను మానేయాలి. అలాగే మొల‌కెత్తిన పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు మ‌ద్యం, పొగ తాగ‌డం మానేయాలి. లేదంటే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

Tags: cholesterolcholesterol levelsHDLLDLఎల్‌డీఎల్‌కొలెస్ట్రాల్కొలెస్ట్రాల్ స్థాయిలుహెచ్‌డీఎల్‌
Admin

Admin

Related Stories

గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో తెలుసా..?

by Admin
July 28, 2025
0

గోర్లు కొర‌క‌డం చాలా మందికి ఉండే అల‌వాటు. చిన్నారులే కాదు, కొంద‌రు పెద్దలు కూడా గోర్ల‌ను ప‌దే ప‌దే కొరుకుతుంటారు. అయితే నిజానికి గోర్ల‌ను కొర‌క‌డ‌మ‌నేది చాలా...

డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ లో అర్ధం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా.? 3 కారణాలు ఇవే.!

by Admin
July 25, 2025
0

సుస్తీ చేస్తే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం, ల‌క్ష‌ణాలు చెప్ప‌డం, ఆరోగ్య ప‌రిస్థితిని వివ‌రించ‌డం, ఆయ‌న ఇచ్చిన చిట్టీ ప‌ట్టుకుని మందులు కొన‌డం, మింగడం… ఇదీ అనారోగ్యం బారిన...

ఏ వ‌యస్సులో ఉన్న‌వారికి ఎంత నిద్ర అవ‌స‌రం అంటే..?

by Admin
July 25, 2025
0

నిద్ర బంగారం. ఆ మాటకొస్తే బంగారం కన్నా గొప్పదీనూ. ఇది కొరవడకుండా చూసుకుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. మున్ముందు జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. చురుకుదనం, పనుల్లో సామర్థ్యం ఇనుమడిస్తుంది....

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

by Admin
July 23, 2025
0

శరీరానికి కావాల్సిన శక్తి చక్కగా అందాలంటే.. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుందని భావిస్తాం...

Next Post

గ్యాస్ వ‌ల్ల పొట్ట ఉబ్బిన‌ట్లు అవుతుందా ? ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలు, స‌మ‌స్య త‌గ్గుతుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.