Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Boondi Mithayi : బూందీ మిఠాయిని ఇలా చేస్తే.. అచ్చం స్వీట్ షాపుల్లో ఇచ్చే విధంగా వ‌స్తుంది.. ఎంతో రుచిగా ఉంటుంది..

D by D
December 17, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Boondi Mithayi : బూందీ చిక్కి.. బూందీ మిఠాయి.. పేరేదైనా దీని రుచి మాత్రం క‌మ్మ‌గా ఉంటుంది. పండుగ‌ల‌కు దీనిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో కూడా ఈ బూందీ మిఠాయి ల‌భిస్తుంది. దీనిని త‌యారు చేసే విధానం మ‌న‌లో చాలా మందికి తెలిసిన‌ప్ప‌టికి ఈ చిక్కి మెత్త‌గా లేదా గ‌ట్టిగా అవుతూ ఉంటుంది. ఈ బూందీ చిక్కిని రుచిగా, చ‌క్క‌గా స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బూందీ చిక్కి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, బియ్యం పిండి – ఒక క‌ప్పు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Boondi Mithayi recipe in telugu very sweet easy to make
Boondi Mithayi

బూందీ మిఠాయి త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండి, బియ్యం పిండిని తీసుకోవాలి. త‌రువాత దీనిలో త‌గిన‌న్ని నీళ్లు పోసి పిండిని ప‌లుచ‌గా గంటె జారుడుగా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడ‌య్యాక బూందీ గంటెను తీసుకుని అందులో పిండి వేస్తూ బూందీని వేసుకోవాలి. ఈ బూందీని రంగు మారి కొద్దిగా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా బూందీని త‌యారు చేసుకున్న త‌రువాత మ‌రో క‌ళాయిలో బెల్లం తురుము, అర టీ గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగి ముదురు పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. బెల్లం మిశ్ర‌మాన్ని నీటిలో వేసి చూస్తే గట్టిగా ముద్ద‌గా అవ్వాలి. ఇలా ఉడికించిన త‌రువాత అందులో యాల‌కుల పొడితో పాటు ముందుగా వేయించుకున్న బూందీని వేసి క‌ల‌పాలి. బూందీకి బెల్లం మిశ్ర‌మం ప‌ట్టిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దీనిని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి.

త‌రువాత దీనిని పైన స‌మానంగా ప్లేట్ అంతా చేసుకోవాలి. ఇది గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత కావల్సిన ఆకారంలో ముక్క‌లుగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన తరువాత ముక్క‌లుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బూందీ మిఠాయి త‌యార‌వుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు, పండుగ‌ల‌కు, ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ఇలా బూందీ చిక్కిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Boondi Mithayi
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Thyroid : థైరాయిడ్ ఉన్న‌వారు ఇలా చేస్తే.. దెబ్బ‌కు కంట్రోల్ అవుతుంది..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.