Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chalimidi : సాంప్ర‌దాయ వంట చ‌లిమిడి.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

D by D
September 19, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chalimidi : చ‌లిమిడి.. ఇది తెలియ‌ని వారు.. దీనిని రుచి చూడని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం త‌యారు చేసే సాంప్ర‌దాయ వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ చ‌లిమిడిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌నే ఉండ‌రు. ఎక్కువ‌గా దీనిని పండ‌గ‌ల‌కు త‌యారుచేస్తూ ఉంటారు. అలాగే దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఒక్కో రుచితో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చ‌లిమిడి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి చేసే వారు కూడా ఈ చ‌లిమిడిని ఎంతో సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ చ‌లిమిడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌లిమిడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బెల్లం తురుము – 250 గ్రా., పంచ‌దార – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టీ స్పూన్, త‌డి బియ్యం పిండి – 350 గ్రా. నుండి 400 గ్రా., జీడిప‌ప్పు – పిడికెడు, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 3 టేబుల్ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్.

Chalimidi recipe in telugu very tasty how to make it
Chalimidi

చ‌లిమిడి త‌యారీ విధానం..

ముందుగా మందంగా ఉండే క‌ళాయిలో బెల్లం తురుము, పంచ‌దార‌ను వేసుకోవాలి. త‌రువాత ఇవి మునిగే వ‌ర‌కు నీటిని పోసి క‌లుపుతూ వేడి చేయాలి. బెల్లం క‌రిగి పొంగు వ‌చ్చేట‌ప్పుడు నెయ్యి వేసి క‌ల‌పాలి. బెల్లం మిశ్ర‌మం ముద్ద‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. బెల్లం మిశ్ర‌మాన్ని నీటిలో వేసి చూస్తే అది ఉండ క‌ట్టాలి. ఇలా బెల్లం మిశ్ర‌మం త‌యార‌వ్వ‌గానే కొద్ది కొద్దిగా త‌డి బియ్యం పిండిని వేస్తూ ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మం ముద్ద‌గా అయిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప‌క్కకు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఎండు కొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత గ‌స‌గ‌సాలు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ ను, యాల‌కుల పొడిని చ‌లిమిడిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చ‌లిమిడి త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన చ‌లిమిడిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Chalimidi
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Bread Kaja : స్వీట్ తినాల‌నిపిస్తే బ్రెడ్‌తో అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.