Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Dhaba Style Aloo Matar Curry : ధాబా స్టైల్‌లో ఆలు, ప‌చ్చి బ‌ఠానీల‌ను వేసి ఇలా క‌ర్రీ చేయండి.. రోటీల్లోకి అదిరిపోతుంది..!

D by D
December 15, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Dhaba Style Aloo Matar Curry : మ‌న‌కు ధాబాలల్లో ల‌భించే వెజ్ క‌ర్రీల‌ల్లో ఆలూ మ‌ట‌ర్ క‌ర్రీ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, ప‌చ్చిబ‌ఠానీ క‌లిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, పుల్కా, పూరీ,నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఆ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. బంగాళాదుంప‌ల‌తో త‌రుచూ ఒకేర‌కమైన కూర‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే ధాబా స్టైల్ ఆలూ మ‌ట‌ర్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ ఆలూ మ‌ట‌ర్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

త‌రిగిన ట‌మాటాలు – 3, ప‌చ్చిమిర్చి – 2, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెమ్మ‌లు – 8, బంగాళాదుంప‌లు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయలు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌పిండి – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – ముప్పావు లీట‌ర్, ప‌చ్చిబ‌ఠాణీ – పావు క‌ప్పు, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఇంగువ – పావు టీ స్పూన్.

Dhaba Style Aloo Matar Curry recipe in telugu tasty with rotis
Dhaba Style Aloo Matar Curry

ధాబా స్టైల్ ఆలూ మ‌ట‌ర్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ట‌మాటాలు, ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెమ్మ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత బంగాళాదుంప‌ల‌పై ఉండే పొట్టును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకుని నీటిలో వేసి ఉంచుకోవాలి. త‌రువాత క‌ళాయిలో బ‌ట‌ర్, నూనె వేసి వేడి చేయాలి.త‌రువాత జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌సుపు వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత కారం, శ‌న‌గ‌పిండి, ధ‌నియాల పొడి, ఉప్పు వేసి క‌ల‌పాలి.

దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత బ‌ఠాణీ, బంగాళాదుంప ముక్క‌లు వేసిక‌ల‌పాలి. త‌రువాత ఆమ్ చూర్ వేసి క‌లిపి మూత పెట్టాలి. దీనిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌రకు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ బ‌ట‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఆమ్ చూర్ పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని కూర‌లో వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మ‌ట‌ర్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చాలా సుల‌భంగా ఇంట్లోనే ధాబా స్టైల్ ఆలూ మ‌ట‌ర్ క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Dhaba Style Aloo Matar Curry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Vastu Tips : పొర‌పాటున కూడా ఈ వ‌స్తువుల‌ను ఎవ‌రికీ ఉచితంగా ఇవ్వొద్దు, తీసుకోవ‌ద్దు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.