Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Beeruva : బీరువా విష‌యంలో ఈ పొర‌పాట్లు చేస్తే అంతే.. ధ‌న న‌ష్టం జ‌రుగుతుంది..!

D by D
June 7, 2022
in vastu, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Beeruva : మ‌నం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటాం. అలాగే కొన్ని వ‌స్తువుల‌ను కూడా వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ఉంచుకోవాలి. ఈ వ‌స్తువుల‌ను ఇంట్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఉంచ‌కూడ‌దు. అలాంటి వాటిల్లో బీరువా ఒక‌టి. మ‌నం సంపాదించిన ధ‌నాన్ని బీరువాలో దాచిపెడుతూ ఉంటాం. బీరువాను ఇంట్లో వాస్తు శాస్త్రం ప్ర‌కార‌మే ఉంచాలి. అలాగే బీరువాలో ధ‌నాన్ని దాచిపెట్టుకునేట‌ప్పుడు కూడా కొన్ని వ‌స్తువుల‌ను ఉంచ‌కూడ‌దు. ఇంట్లో బీరువాను ఏమూల‌న‌, ఏ దిక్కున ఉంచాలి.. బీరువాలో ఉంచ‌కూడ‌ని వ‌స్తువులు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీరువాను ఇంట్లో వాయువ్యం వైపు ఉంచాలి. ఈ దిక్కును చంద్రుడు పాలిస్తాడు. బీరువాను ఈ దిక్కున ఉంచ‌డం వ‌ల్ల మన ఇంట్లోకి ధ‌నం ఎక్కువ‌గా వ‌స్తుంది. ధ‌న న‌ష్టం త‌గ్గుతుంది. అలాగే బీరువాను ద‌క్షిణ దిక్కున కూడా పెట్టుకోవ‌చ్చు. బీరువా ముఖం ఉత్త‌రం వైపు ఉండేలా లేదా ఉత్త‌రం దిక్కున కూడా పెట్టుకోవ‌చ్చు. ఉత్త‌రం దిక్కు అనేది కుబేర స్థానం. ఉత్త‌రం దిక్కుకు బుధుడు అధిప‌తి. బుధుడు సంప‌ద‌కు అధిప‌తి. క‌నుక మ‌నం బీరువాను ఉత్త‌రం దిక్కున కూడా పెట్టుకోవ‌చ్చు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
do not do these mistakes while putting Beeruva in your home
Beeruva

అయితే బీరువాను నైరుతి వైపు మాత్రం అస్స‌లు ఉంచ‌కూడ‌దు. ఇలా ఉంచ‌డం వ‌ల్ల ధ‌నం అస్స‌లు నిల‌వ‌దు. బీరువాలో ఎప్పుడూ కూడా డ‌బ్బు, న‌గ‌లు, వెండి వ‌స్తువులు, విలువైన ప‌త్రాలు.. వంటి వాటినే ఉంచాలి. బ‌ట్ట‌ల‌ను బీరువా కింద భాగంలో ఉంచాలి. బీరువా నుండి ఎప్పుడూ సువాస‌న వ‌చ్చేలా చూసుకోవాలి. బీరువాకు ఒక‌వైపు డోర్ మీద‌ స్వ‌స్తిక్, ఓం, శ్రీ గుర్తుల‌ను వేసి ఉంచాలి. మ‌రోవైపు ల‌క్ష్మీ దేవి కి అటూ ఇటూ ఏనుగులు ఉన్న బొమ్మ‌ను పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లోకి డ‌బ్బు ఎక్కువ‌గా వ‌స్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అలాగే పూజ గ‌దిలో ఈశాన్యం మూల‌న ఒక రాగి చెంబులో నీళ్లు, ప‌సుపు, కుంకుమ‌, అక్షింత‌లు, ఒక పువ్వు వేసి ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండ‌దు. పూజ గ‌దిలో ఎప్పుడూ కామాక్షి దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. పూజ గ‌దిలో, బెడ్ రూమ్ లో చీపురును ఉంచ‌కూడ‌దు. ఇంటిని కూడా ఈశాన్యం నుండి నైరుతి వైపు ఊడ్చుకోవాలి. చీపురు, చాట‌ను కూడా ఎప్పుడూ ఒకే స్థానంలో ఉంచ‌కూడ‌దు. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వల్ల మ‌న ఇంట్లో ధ‌నానికి ఎప్పుడూ లోటు ఉండ‌ద‌ని.. మ‌నం ల‌క్ష్మీ దేవి క‌టాక్షాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Tags: Beeruva
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Godhuma Rava Kesari : గోధుమ ర‌వ్వ కేస‌రి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.