Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Tomato Chicken : ఎంతో రుచిక‌ర‌మైన ట‌మాటా చికెన్‌.. ఇలా చేసి తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

D by D
February 1, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Tomato Chicken : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో ట‌మాట చికెన్ కూడా ఒక‌టి. టమాటాలు వేసి చేసే ఈ చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు. త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా చికెన్ తో వెరైటీగా ఇలా ట‌మాట చికెన్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాట చికెన్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నూనె – 1/3 క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ట‌మాటాలు – 2, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ట‌మాటాలు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన చికెన్ – అర‌కిలో, నీళ్లు – 250 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.

make Tomato Chicken in this method very taste
Tomato Chicken

ట‌మాట చికెన్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి 3 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ఈ టమాట ముక్క‌ల‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ లోకి వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ఉప్పు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, కారం, గ‌రం మ‌సాలా వేసి క‌లపాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకుని ఉడికించాలి. ట‌మాట మిశ్ర‌మం స‌గం వ‌ర‌కు ఉడికిన త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా ఉడికించాలి.

ఇలా ఉడికించిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిని పెద్ద మంట‌పై 4 నిమిషాల పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసి చికెన్ ను 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత వేయించిన ట‌మాట ముక్క‌లు వేసి క‌లిపి మూత పెట్టి చిన్న మంట‌పై మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట చికెన్ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ట‌మాట చికెన్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Tomato Chicken
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Dry Cough : పొడి ద‌గ్గు మిమ్మ‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. అయితే ఈ 10 చిట్కాల‌ను పాటించండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.