Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Mushroom Pakoda : సాయంత్రం స‌మ‌యంలో వేడి వేడిగా ఇలా పుట్ట‌గొడుగుల‌తో ప‌కోడీల‌ను చేసి తినండి.. సూప‌ర్‌గా ఉంటాయి..!

D by D
September 19, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Mushroom Pakoda : అనేక ర‌కాల పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగిన ఆహారాల్లో పుట్ట‌గొడుగులు కూడా ఒక‌టి. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో పుట్ట‌గొడుగులు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. త‌రుచూ కూర‌లే కాకుండా ఈ పుట్టగొడుగుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌కోడాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌కోడాలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లో పుట్ట‌గొడుగులు ఉంటే చాలు చిటికెలో ఈ ప‌కోడాలను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పుట్టగొడుగు ప‌కోడాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ష్రూమ్ ప‌కోడా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

పుట్ట‌గొడుగులు – 200 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌పిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Mushroom Pakoda recipe in telugu make in this method
Mushroom Pakoda

మ‌ష్రూమ్ ప‌కోడా త‌యారీ విధానం..

ముందుగా పుట్ట‌గొడుగుల‌ను శుభ్రంగా క‌డిగి నాలుగు లేదా ఆరు ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మసాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో క‌ట్ చేసుకున్న పుట్ట‌గొడుగు ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు బియ్యంపిండి, కార్న్ ఫ్లోర్, శ‌న‌గ‌పిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండి ముక్క‌ల‌కు ప‌ట్టేలా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పుట్ట‌గొడుగుల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌దుపుతూ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత పిండి క‌లుపుకున్న గిన్నెలోనే జీడిప‌ప్పు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిని నూనెలో వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే మ‌ష్రూమ్ ప‌కోడాలు త‌యార‌వుతాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ విధంగా త‌యారు చేసిన ప‌కోడాల‌ను ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Mushroom Pakoda
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Veg Tossed Salad : రెస్టారెంట్ల‌లో ల‌భించే వెజ్ స‌లాడ్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.