Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Palakova : చాలా త‌క్కువ స‌మ‌యంలోనే కమ్మనైన పాల‌కోవాను ఇలా తయారు చేసుకోండి..!

D by D
April 14, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Palakova : సాధార‌ణంగా మ‌నం పాల‌తో ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుంటూ ఉంటాం. పాల‌తో చేసే తీపి ప‌దార్థాల‌లో పాల‌కోవా ఒక‌టి. పాల‌కోవా చాలా రుచిగా ఉంటుంది. కానీ దీనిని త‌యారు చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఇంట్లో దీనిని అంద‌రూ త‌యారు చేసుకోలేరు. క‌నుక చాలా త‌క్కువ స‌మ‌యంలో పాల‌కోవాను మ‌నం పాల‌పొడితో త‌యారు చేసుకోవ‌చ్చు. పాల పొడితో చేసిన ఈ పాల‌కోవా కూడా చాలా రుచిగా ఉంటుంది. పాల‌పొడితో ఎంతో రుచిగా ఉండే పాల‌కోవాను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Palakova is very sweet make it in short time
Palakova

పాల‌కోవా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్‌, పాల‌పొడి – ఒక‌టిన్న‌ర క‌ప్పు, పాలు – అర క‌ప్పు, పంచ‌దార పొడి – పావు క‌ప్పు, యాల‌కుల పొడి – చిటికెడు, పిస్తా ప‌లుకులు – కొద్దిగా.

పాల‌కోవా త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక కాచి చ‌ల్లార్చిన పాల‌ను వేసుకోవాలి. త‌రువాత పాలపొడి, పంచ‌దార పొడి వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మం ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు చిన్న మంట‌పై 10 నిమిషాల పాటు క‌లుపుతూ ఉండాలి. ఈ మిశ్ర‌మం క‌ళాయికి అతుక్కోకుండా ద‌గ్గ‌ర ప‌డిన‌ప్పుడు త‌యార‌యిన‌దిగా భావించాలి.

ఇప్పుడు యాల‌కుల పొడి వేసి.. బాగా క‌లిపి మ‌రో 2 నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా చల్లారిన త‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కోవా బిళ్ల‌లుగా చేసుకోవాలి. పిస్తా ప‌లుకుల‌తో వీటిని గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఎంతో రుచిగా ఉండే పాల కోవా త‌యార‌వుతుంది. వీటిపై పిస్తాతోపాటు బాదంప‌ప్పు, జీడిపప్పుల‌తోనూ గార్నిష్ చేసుకోవ‌చ్చు. పాల‌పొడితో చేసుకున్న ఈ కోవా కూడా చాలా రుచిగా ఉంటుంది.

Tags: Palakova
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Raisins Curd : కిస్మిస్‌, పెరుగు మిశ్ర‌మాన్ని ఇలా త‌యారు చేసి రోజూ తినండి.. ముఖ్యంగా పురుషులు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.