Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Potato Fry : క‌ళాయి అడుగు అతుక్కుపోకుండా.. బంగాళా దుంప‌ల వేపుడును ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

D by D
August 18, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Potato Fry : మ‌నం ఎక్కువ‌గా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. వీటిలో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బంగాళాదుంప‌ల‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిల్లో బంగాళాదుంప వేపుడు కూడా ఒక‌టి. బంగాళాదుంప వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

అయితే కొంద‌రూ ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినప్ప‌టికీ బంగాళాదుంప వేపుడును క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. బంగాళాదుంప ముక్క‌లు ముద్ద‌గా అవ్వ‌డం, క‌ళాయికి అతుక్కుపోవ‌డం వంటివి జ‌రుగుతాయి. ఈ బంగాళాదుంప వేపుడును క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బంగాళాదుంప వేపుడు త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బంగాళాదుంప‌లు – 5 ( మ‌ధ్య‌స్ఠంగా ఉన్న‌వి), నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్.

Potato Fry very easy to make simple recipe
Potato Fry

బంగాళాదుంప వేపుడు త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప ముక్క‌ల‌ను ఉప్పు వేసిన నీటిలో వేసి రెండు సార్లు బాగా క‌డ‌గాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను నీటి నుండి తీసి జ‌ల్లి గిన్నెలో వేసి నీళ్లు లేకుండా చేసుకోవాలి. త‌రువాత వెడ‌ల్పుగా ఉన్న క‌ళాయిని తీసుకుని అందులో నూనె వేసి నూనె కాగిన త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. త‌రువాత నీళ్లు లేకుండా చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్క‌ల‌ను, క‌రివేపాకును వేసి వేయించుకోవాలి. ఈ ముక్క‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై అడుగు భాగం మాడ‌కుండా క‌లుపుతూ క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత క‌ళాయిలో ముక్క‌ల‌ను ప‌క్క‌న‌ పెట్టి ఎక్కువ‌గా ఉన్న నూనెను తీసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల వేపుడు ఎక్కువ‌గా నూనె లేకుండా ఉంటుంది. త‌రువాత ముక్క‌ల‌ను మ‌రో 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, ఉప్పు వేసి క‌లుపుకోవాలి. ఈ వేపుడును మ‌రో 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే బంగాళాదుంప వేపుడు త‌యార‌వుతుంది. దీనిని ప‌ప్పు, సాంబార్, ర‌సం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల నాన్ స్టిక్ క‌ళాయిలో చేయ‌క‌పోయినా కూడా బంగాళాదుంప వేపుడు అడుగు భాగం మాడ‌కుండా ముద్ద‌గా అవ్వ‌కుండా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటుంది. ఈ విధంగా చేసిన బంగాళాదుంప వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Potato Fry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Sonthi : అన్నంలో మొద‌టి ముద్ద‌గా శొంఠి పొడిని క‌లిపి తింటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.