Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Coconut Laddu : దీన్ని రోజూ ఒక‌టి తినండి చాలు.. అమిత‌మైన బ‌లం క‌లుగుతుంది..!

D by D
April 5, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Coconut Laddu : ప‌చ్చి కొబ్బ‌రి.. బెల్లం.. ఇవి రెండూ అద్భుత‌మైన పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌చ్చికొబ్బ‌రి, బెల్లంల‌ను అలాగే నేరుగా క‌లిపి తినేస్తుంటారు. అయితే వీటిని అలా కాకుండా ల‌డ్డూ రూపంలో త‌యారు చేసి తింటే ఇంకా మేలు జ‌రుగుతుంది. దీంతో రోజుకు ఒక ల‌డ్డూను తిన్నా చాలు.. అమిత‌మైన బ‌లం క‌లుగుతుంది. మ‌రి కొబ్బ‌రి ల‌డ్డూను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

take this Coconut Laddu daily one for amazing benefits
Coconut Laddu

కొబ్బ‌రి ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ప‌చ్చి కొబ్బ‌రి – ఒక‌టిన్న‌ర కొబ్బ‌రి కాయ, బెల్లం తురుము – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్‌, నెయ్యి – 2 టీ స్పూన్స్‌, డ్రై ఫ్రూట్స్ – త‌గిన‌న్ని.

కొబ్బ‌రి ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా ప‌చ్చి కొబ్బ‌రిని ముక్క‌లుగా చేసి జార్ లో వేసి తురుములాగా ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో బెల్లం తురుము వేసి పావు క‌ప్పు నీటిని పోసి బెల్లం క‌రిగే వ‌రకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో కానీ, క‌ళాయిలో కానీ బెల్లం క‌రిగించిన నీటిని పోసి, మ‌ధ్య‌స్థ మంటపై ముదురు తీగ పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంట‌ను త‌గ్గించి, ముందుగా త‌యారు చేసుకున్న కొబ్బ‌రి తురుమును, యాల‌కుల పొడిని వేసి బాగా క‌లుపుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి, అడుగు మాడ‌కుండా క‌లుపుతూ, 10 నిమిషాల పాటు బెల్లం పాకం దగ్గ‌ర ప‌డేలా ఉడికించుకోవాలి. ఇందులో నుండి కొద్ది మిశ్ర‌మాన్ని తీసుకుని ల‌డ్డూలా చేసి చూడాలి. ఈ ల‌డ్డు స‌రిగ్గా వ‌చ్చిన‌ట్ల‌యితే ఈ మిశ్ర‌మం త‌యార‌యిన‌దిగా భావించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఒక వేళ ఈ మిశ్ర‌మం బాగా ఉడికి గ‌ట్టిప‌డితే ఒక టీ స్పూన్ నీళ్ల‌ను పోసి ఒక నిమిషం పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఒక చిన్న క‌ళాయిలో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి డ్రైఫ్రూట్స్ ను వేయించి, ముందుగా త‌యారు చేసుకున్న మిశ్ర‌మంలో వేసి బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా వేడిగా ఉన్న‌ప్పుడే, చేతికి నెయ్యిని రాసుకుంటూ కావ‌ల‌సిన ప‌రిమాణంలో ల‌డ్డూల‌లా త‌యారు చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, జ్యూసీగా ఉండే కొబ్బ‌రి ల‌డ్డూ త‌యార‌వుతుంది. ఈ విధంగా చేసుకున్న ల‌డ్డూలు 10 రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి.

ఇలా కొబ్బ‌రి ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని రోజుకు ఒక‌టి చొప్పున తినాలి. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లేదా మ‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం ఒక ల‌డ్డూను తిన‌వ‌చ్చు. లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలోనూ ఒక ల‌డ్డూను తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల అనేక పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. అనేక వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. నీర‌సం, నిస్స‌త్తువ త‌గ్గిపోతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Tags: Coconut Ladduకొబ్బ‌రి ల‌డ్డూ
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Multi Dal Dosa : వివిధ ర‌కాల ప‌ప్పులతో మ‌ల్టీ దాల్ దోశ‌ను ఇలా వేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.