Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Vankaya Pappu : వంకాయ ప‌ప్పును ఎప్పుడైనా తిన్నారా.. రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..

D by D
December 2, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Vankaya Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ ఒక‌టి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉంటాయి. ఈ వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో వంకాయ ప‌ప్పు కూడా ఒక‌టి. వంకాయ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లే వంకాయ‌ల‌తో కూడా మనం ప‌ప్పును త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

వంకాయ‌లు – 200 గ్రా., కందిప‌ప్పు – 150 గ్రా., త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, తాళింపు గింజ‌లు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, ప‌సుపు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నాన‌బెట్టిన చింతపండు – 5 గ్రా., నూనె – రెండు టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌చ్చా ప‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5.

Vankaya Pappu recipe in telugu know how to cook it
Vankaya Pappu

వంకాయ ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు, పావు టీ స్పూన్ ప‌సుపును వేసి మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న త‌రువాత ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు గింజ‌ల‌ను, ఎండుమిర్చిని, క‌చ్చాప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి వేయించాలి. త‌రువాత ఇంగువ‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత వంకాయ ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై వంకాయ ముక్క‌ల‌ను వేయించుకోవాలి. వంకాయ ముక్క‌లు వేగిన త‌రువాత టమాట ముక్క‌లు వేసి వేయించాలి.

ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత అందులో కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో ఉడికించిన ప‌ప్పు, చింత‌పండు ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ ప‌ప్పు త‌యార‌వుతుంది. వేడి వేడి అన్నం, నెయ్యితో క‌లిపి ఈ ప‌ప్పును తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌ల‌తో పాటు ఇలా ప‌ప్పును కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Vankaya Pappu
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Cough : ద‌గ్గు, జ‌లుబును క్ష‌ణాల్లో త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఏం చేయాలంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.