Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Vankaya Vepudu : వంకాయ వేపుడును ఇలా చేస్తే.. ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

D by D
December 15, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Vankaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు ఒక‌టి. వంకాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వంక‌యాల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ వంకాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. అన్నంతో క‌లిపి తింటే వంకాయ వేపుడు కూర చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే వంకాయ వేపుడు కంటే కింద చెప్పిన విధంగా చేసే వంకాయ వేపుడు మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ వేపుడు కూర‌ను సుల‌భంగా చేయ‌వ‌చ్చు. మ‌రింత రుచిగా, స‌లుభంగా వంకాయ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

వంకాయ‌లు – పావు కిలో, వేయించి పొట్టు తీసిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ఎండుమిర్చి – 7, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, స‌న్న‌గా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Vankaya Vepudu recipe in telugu make in this way
Vankaya Vepudu

వంకాయ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను చిన్న ముక్క‌లుగా త‌రిగి ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత జార్ లో ఎండుమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బ‌లు, నువ్వులు, ప‌ల్లీలు వేసి మరీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, క‌రివేపాకుతో పాటు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను క‌చ్చా ప‌చ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఇవి అన్నీ వేగిన త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత వంకాయ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌ధ్య మధ్య‌లో క‌లుపుతూ వంకాయ ముక్క‌ల‌ను పూర్తిగా వేయించాలి. త‌రువాత మూత తీసి మ‌రో రెండు నిమిషాల పాటు వంకాయ ముక్క‌ల‌ను వేయించాలి.

ఇలా వేయించిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న పొడిని వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో మూడు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే వంకాయ వేపుడు కంటే ఈ విధంగా చేసిన వంకాయ వేపుడు మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని పిల్ల‌ల‌తో పాటు అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Vankaya Vepudu
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Bellam Paramannam : బెల్లంతో ప‌ర‌మాన్నం త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.