Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Village Style Mutton Curry : ఉల్లిపాయ‌, ట‌మాటా లేకుండా.. ఎక్కువ గ్రేవీ వ‌చ్చేలా.. విలేజ్ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

D by D
September 6, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Village Style Mutton Curry : మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ ను తిన‌డం వల్ల మ‌న శరీరానికి కావ‌ల్సిన‌న్ని ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌ట‌న్ తో ఏ వంట‌కం వండిన కూడా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా విలేజ్ స్టైల్ లో మ‌ట‌న్ క‌ర్రీ ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

విలేజ్ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

మ‌ట‌న్ – అర కిలో, కారం – 2 టీ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 5, దాల్చిన చెక్క ముక్క‌లు – 2, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, మిరియాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – 2 రెబ్బ‌లు, పెరుగు – పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన పుదీనా – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు లీట‌ర్.

Village Style Mutton Curry here it is how to cook
Village Style Mutton Curry

విలేజ్ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా మ‌టన్ ను శుభ్రంగా క‌డిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో ఉప్పు, కారం, ప‌సుపు వేసి ముక్క‌ల‌కు పట్టేలా బాగా క‌లిపి 20 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచుకోవాలి. త‌రువాత ఒక జార్ లో ఎండు కొబ్బ‌రి ముక్క‌లు, దాల్చిన చెక్క, ధ‌నియాలు, ల‌వంగాలు, యాల‌కులు, మిరియాలు, జీల‌క‌ర్ర‌, గ‌స‌గ‌సాలు వేసి ముందుగా మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కుక్క‌ర్ లో నూనె వేసి నూనె కాగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి.

త‌రువాత ఇందులో ముందుగా సిద్దం చేసుకున్న మ‌ట‌న్ ను, ప‌చ్చిమిర్చిని, క‌రివేపాకును వేసి క‌లపాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న మ‌సాలా పేస్ట్ ను, పెరుగును వేసి క‌లిపి కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి కుక్క‌ర్ పై మూత‌ను ఉంచి 6 నుండి 8 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. మ‌ట‌న్ లేతగా ఉంటే 4 నుండి 6 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ముదురు మ‌ట‌న్ అయితే 8 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి.

మ‌ట‌న్ ముక్క‌లు మెత్త‌గా ఉడ‌క‌క‌పోతే మ‌రి కొద్దిసేపు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, వ‌డ‌, చ‌పాతీ, పూరీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉండ‌డ‌మే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

Tags: Village Style Mutton Curry
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Chana Dal Namkeen : దుకాణాల్లో ల‌భించే చ‌నా దాల్ న‌మ్‌కీన్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.