Ragi Pindi Punugulu : రాగి పిండితో పునుగులను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Ragi Pindi Punugulu : మన ఆరోగ్యానికి రాగిపిండి ఎంతోమేలు చేస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చడంలో, శరీరాన్ని ధృడంగా చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా రాగిపిండి మనకు మేలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో రాగిపిండితో మనం అనేక రకాల వంటకాలను తయారు చేస్తున్నాము. రాగిపిండితో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. రాగిపిండితో చేసుకోదగిన రుచికరమైన వెరైటీ వంటకాల్లో రాగి పునుగులు కూడా ఒకటి. రాగిపునుగులు చాలా రుచిగా…