కిడ్నీ స్టోన్లు ఉన్న వారికి ఎముకల సమస్యలు.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి..
మీకు కిడ్నీ స్టోన్ల సమస్య ఉందా ? అయితే ఎందుకైనా మంచిది. ఒకసారి ఎముకలను కూడా చెక్ చేయించుకోండి. ఎందుకంటే.. కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారికి ఎముకల సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మేరకు బోన్ అండ్ మినరల్ రీసెర్చ్ అనే జర్నల్‌లో సైంటిస్టులు ఓ అధ్యయనానికి చెందిన వివరాలను ప్రచురించారు. 2007 నుంచి 2015 మధ్య 5,31,431 మంది కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్న వారిపై సైంటిస్టులు…