Idli Masala Upma : మిగిలిపోయిన ఇడ్లీలను పడేయకండి.. వాటితో ఎంచక్కా ఇలా ఉప్మాను చేయవచ్చు.. రుచిగా ఉంటుంది..
Idli Masala Upma : ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు. రవ్వతో చేసే ఉప్మా కారణంగా చాలా మంది ఉప్మాను తినేందుకు ఇష్టపడరు. కానీ అందులోనే కూరగాయలు, జీడిపప్పు, పల్లీలు వంటివి వేసి చేస్తే ఇష్టంగా తింటారు. అయితే ఉప్మాను కేవలం రవ్వతో మాత్రమే కాదు.. మిగిలిపోయిన ఇడ్లీలతోనూ చేయవచ్చు. ఇడ్లీలు మిగిలిపోయాయని బాధపడకుండా వాటితో ఉప్మాను చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….