Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

రోజూ ప‌ర‌గ‌డుపునే ప‌సుపు టీ తాగితే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు..!

Admin by Admin
June 1, 2021
in డ్రింక్స్‌
0
Share on FacebookShare on Twitter

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. అందుకు గాను చాలా మంది అనేక ర‌కాల క్రాష్ డైట్‌ల‌ను పాటిస్తున్నారు. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకునే య‌త్నంలో శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను రోజూ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేస్తుంది. ఇక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు అధిక బ‌రువును త‌గ్గించేందుకు పసుపు బాగా ప‌నిచేస్తుంది. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా స్థూల‌కాయం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

drink this turmeric tea on empty stomach to reduce over weight

You might also like

Lungs Clean Drink : పొగ తాగేవారు ఇక‌పై ఆపండి.. ఊపిరితిత్తుల‌ను ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి..!

March 9, 2023

Weight Loss Drink : రోజూ రాత్రి దీన్ని తాగండి.. నెల రోజుల్లోనే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..!

March 6, 2023

ప‌సుపులో ఔషధ విలువలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇది ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది. శ‌రీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక బ‌రువు త‌గ్గాలంటే రోజూ ప‌సుపును ఏవిధంగా, ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి.

అధిక బ‌రువును త‌గ్గించే ప‌సుపు టీ

అధిక బ‌రువును త‌గ్గించేందుకు ప‌సుపు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతో త‌యారు చేసే టీని తాగితే బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. ఒక క‌ప్పు నీటిని తీసుకుని బాగా మ‌రిగించాలి. అనంత‌రం అందులో చిటికెడు ప‌సుపు వేయాలి. కొద్దిగా దాల్చిన‌చెక్క పొడి కూడా వేసి స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. దీంతో కొద్ది సేప‌టికి టీ త‌యార‌వుతుంది. అందులో తీపి కావాల‌నుకుంటే తేనె క‌లుపుకోవ‌చ్చు. దీన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రోజూ తాగాలి.

ప‌సుపు పాలు కూడా అధిక బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డ‌తాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు క‌లిపి రోజూ రాత్రి నిద్రించే ముందు తాగాలి. దీంతోపాటు యోగా, వ్యాయామాలు చేయాలి. ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న‌శైలిని పాటించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు.

అధిక బ‌రువును త‌గ్గించేందుకు ప‌సుపు టీ ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది ?

ప‌సుపులో విట‌మిన్ బి, సి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా లినోలియిక్ యాసిడ్‌, ఫైబ‌ర్‌, పొటాషియం, ఐర‌న్‌లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతో శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అధికంగా ఉండే కొవ్వు క‌రుగుతుంది. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు. ప‌సుపులో ఉండే థ‌యామిన్‌, ఫాస్ఫ‌ర‌స్‌, ప్రోటీన్లు, సోడియం, విట‌మిన్లు, కాల్షియం, మాంగ‌నీస్‌, పొటాషియం, నియాసిన్‌లు శరీరంలో ఉండే కొవ్వును క‌రిగించేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి. దీంతో బ‌రువు త‌గ్గుతారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: obesityover weightturmericweight lossఅధిక బ‌రువుప‌సుపుబ‌రువు తగ్గ‌డంస్థూల‌కాయం
Admin

Admin

Related Stories

Lungs Clean Drink : పొగ తాగేవారు ఇక‌పై ఆపండి.. ఊపిరితిత్తుల‌ను ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి..!

by D
March 9, 2023
0

Lungs Clean Drink : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై మ‌న శ‌రీర ఆరోగ్యం...

Weight Loss Drink : రోజూ రాత్రి దీన్ని తాగండి.. నెల రోజుల్లోనే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..!

by D
March 6, 2023
0

Weight Loss Drink : ఈ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ ను ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వచ్చు. ఈ...

Healthy Drink : రోజూ రాత్రి ఒక్క గ్లాస్ చాలు.. ర‌క్తం పెరుగుతుంది.. శ‌రీరం బ‌లంగా మారుతుంది..!

by D
February 22, 2023
0

Healthy Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మస్య‌లు త‌గ్గు ముఖం...

Rose Apple Juice : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!

by D
February 21, 2023
0

Rose Apple Juice : వేస‌వి కాలం రానే వ‌స్తుంది. ఉష్ణోగ్ర‌త‌లు రోజురోజుకు పెరుగుతున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎండ‌లో బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చామంటే చాలు ఎక్క‌డ‌లేని నీర‌సం, నిస్స‌త్తువ...

Next Post

మార్కెట్‌లోకి డాబ‌ర్ కొత్త ఔష‌ధం.. త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ నుంచి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.