ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే..?
హిందూ సంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ ధరిస్తారు. అది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మ దేవుడు కొలువై ఉంటాడు. జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తికి నుదుటి భాగం స్థానం. అందుకే రెండు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకుంటారు. నుదుటిన బొట్టు సంప్రదాయంగా మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. గౌరవానికి…